Pension and Allowances of Ramnath Kovind after Retirement మాజీ రాష్ట్రపతికి లభించే పెన్షన్.. ఇతర అలవెన్సుల వివరాలు తెలుసా.?

Pension and allowances of ramnath kovind after retirement

President of India, President election, President election 2022, Presdint Kovind, Ram Nath Kovind, Droupadi Murmu, Yahwant Sinha, NDA, private secretary, a peon, office expenditures, retirement perks, car allowance, official vehicle, private secretary, personal assistant, Pension, perks

Being the country's top constitutional post and first citizen of the country, the President of India is entitled to various benefits, both in and after office. Let's have a look at the salary, pension and all benefits available. The former president is eligible to earn a pension worth Rs 2.5 lakh per month, or 50 percent of their monthly salary, as well as other retirement perks. In addition, he or she has access to up to Rs 1 lakh annually for office expenditures.

మాజీ రాష్ట్రపతికి లభించే పెన్షన్.. ఇతర అలవెన్సుల వివరాలు తెలుసా.?

Posted: 07/20/2022 09:04 PM IST
Pension and allowances of ramnath kovind after retirement

భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ నెల 23న కోవింద్ గౌరవార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫేర్ వెల్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోవింద్ కు మెమెంటోతో పాటు, పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసిన సిగ్నేచర్ బుక్ ను బహూకరించనున్నారు.

రామ్ నాథ్ కోవింద్ పదవీ విరమణ పొందే రోజుకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 22న... ఆయనకు చెందిన సామగ్రినంతటినీ రాష్ట్రపతి భవన్ నుంచి కొత్త బంగళాకు తరలించనున్నారు. ఈ నెల 25న ఆయన రాష్ట్రపతి భవన్ ను ఖాళీ చేస్తారు. 10 జన్ పథ్ లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బంగళాకు ఆనుకుని ఉన్న బంగళాను కోవింద్ కు కేటాయించారు.

రిటైర్మెంట్ తర్వాత కోవింద్ కు అందే పెన్షన్, ఇతర సదుపాయాలు ఇవే:

* ప్రతి నెల రూ. 2.50 లక్షల రూపాయల పెన్షన్ లభిస్తుంది.
* ఆఫీస్ ఖర్చులకు ఏడాదికి రూ. 1 లక్ష ఇస్తారు.
* కోవింద్ కు కేటాయించిన బంగళా పూర్తిగా ఉచితం. ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* రెండు ల్యాండ్ లైన్లు, ఒక మొబైల్ ఫోన్, బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు.
* ఎలెక్ట్రిసిటీ, వాటర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* కారు, డ్రైవర్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తారు.
* ఆరోగ్య సదుపాయాలు మొత్తం ఉచితం.
* విమాన, రైలు ప్రయాణాలు ఉచితం. కోవింద్ తో పాటు ఒక సహాయకుడు ఉచితంగానే ప్రయాణించవచ్చు.
* ఐదుగురు పర్సనల్ స్టాఫ్ ను కేంద్రమే కేటాయిస్తుంది.
* ఢిల్లీ పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు.
* ఇద్దరు సెక్రటరీలను కేటాయిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles