Free Covid precaution doses for 18-59 age group from July 15 త్వరలో ఉచితంగానే కొవిడ్ వాక్సీన్ ప్రికాషన్​ డోస్.. !

Free covid precaution doses for 18 59 age group from july 15 at government centres officials

coronavirus vaccine, covid vaccine, covid booster dose, Covid precaution doses, booster shot, precautionary dose, COVID-19 vaccine, Free covid-19 booster dose from July 15 for adults, Free Covid precaution doses, booster dose, free Covid booster dose, Covid vaccine, vaccines, coronavirus vaccine booster dose, Covid precautionary doses

As part of the Azadi Ka Amrit Mahotsav celebrations, free precaution doses of COVID-19 vaccines will be available for all citizens above 18 years of age at government vaccination centres from July 15 for 75 days, Anurag Singh Thakur, Union Minister of Information and Broadcasting, announced on July 13, following a meeting of the Union Cabinet.

త్వరలో ఉచితంగానే కొవిడ్ వాక్సీన్ ప్రికాషన్​ డోస్.. !

Posted: 07/13/2022 04:13 PM IST
Free covid precaution doses for 18 59 age group from july 15 at government centres officials

అజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు డబ్బులు వెచ్చించి తీసుకున్న కొవిడ్ టీకా ప్రికాషన్ డోసును ఈనెల 15 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇది కేవలం 18-59 ఏళ్ల వయసు వారికి మాత్రమే అందిస్తున్నట్లు ప్రకటించింది 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారికి.. ఉచితంగా కొవిడ్ టీకా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 15 నుంచి 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన 75 వసంతాలు కావస్తున్న సందర్భంగా జరుపుకుంటున్న ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 75 రోజుల పాటు ఈ ప్రికాషనరీ డోస్ ను అందించనున్నారు. అర్హులైన దేశప్రజలందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరోనా టీకా మూడో డోసు తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపాయి. 18 నుంచి 59 ఏళ్ల మధ్యనున్నవారిలో.. కొవిడ్ టీకా ప్రికాషన్‌ డోసుకు 77కోట్ల మంది అర్హులు. వీరిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు.

ఇదే సమయంలో టీకా తీసుకునేందుకు అర్హులైన 60 ఏళ్లకు పైబడిన వారు 16కోట్ల మంది ఉండగా.. వారిలో 26శాతం మంది ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశ జనాభాలో మెజారిటీ భాగం. 9 నెలల కిందట రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. ఆరునెలల తర్వాత యాంటీబాడీల స్థాయి తగ్గుతున్న విషయాన్ని ఐసీఎంఆర్ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనంలో తేలిందని వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులైన వ్యక్తులు ప్రికాషన్ డోసు తీసుకోవాలని కోరుతున్నారు. కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య గడువును కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles