Teacher suspended, booked for thrashing child in UP విద్యార్థినిని జుట్టు పట్టుకుని 30 సెకన్లలో 10 చెంపదెబ్బలు

Viral video woman shiksha mitra brutally thrashes student for making noise in classroom

shiksha mitra beats student, para teacher, para teacher thrashed a girl student, sunil kumari, Islam Nagar Primary School, Asoha block, Asoha Police Station, teacher beats student, unnao teacher, unnao government school, uttar pradesh government school, Uttar Pradesh, Uttar Pradesh Crime News, social media, social media platforms, viral video, video viral

A woman shiksha mitra or para teacher allegedly thrashed a girl student brutally for allegedly making noise in the classroom in a government school in Unnao district of Uttar Pradesh. A video of the incident, recorded by some unknown person, went viral on social media platforms.

ITEMVIDEOS: చిన్నారిపై టీచర్ అఘాయిత్యం: జుట్టు పట్టుకుని 30 సెకన్లలో 10 చెంపదెబ్బలు

Posted: 07/12/2022 07:32 PM IST
Viral video woman shiksha mitra brutally thrashes student for making noise in classroom

పిల్లల విద్యావిధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ చదువులు వచ్చేశాయి. దానికి తోడు కరోనా కారణంగా విద్యార్థులు.. బడులకు నెలల పాటు బడులకు దూరమయ్యారు. కొత్తగా స్కూల్స్‌ ప్రారంభం కావడంతో విద్యార్థులు చదువులో బాగా వెనకబడ్డారు. దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో ఓ టీచర్‌ దారుణంగా వ్యవహరించింది. ఆమెకు కూడా ఓ తల్లేనన్న విషయం మరచి.. పాపం పసిపాపను చితకబాదింది.

ఐదేళ్ల చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్​ జిల్లా అసోహా మండలం ఇస్లామ్​ నగర్ ప్రభుత్వ​ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర లేదా పారా టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్‌ రూమ్‌ శబ్ధం చేసిందని, హోం వర్క్‌ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు.

ఈ ఘటన ఈనెల 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. అనంతరం టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్​ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles