OPS lost relevance through repeated indecisiveness ‘‘నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా’’: పన్నీర్ సెల్వం

Aiadmk tussle eps ops move madras high court against sealing of aiadmk office

AIADMK General Council, Madras High Court, EPS, OPS, ADMK, AIADMK, Edappadi K Palaniswami, O Panneerselvam, OPS expelled, EPS interim general secretary, AIADMK interim general secretary, Natham Viswanathan, D Jayakumar, AIADMK headquarters sealed, OPS dharna, Tamil Nadu Politics

A day after high drama, the fight between AIADMK’s “interim general secretary” Edappadi K Palaniswami (EPS) and “expelled” senior leader O Panneerselvam (OPS) reached the Election Commission and banks. The two also moved the Madras High Court against the sealing of the party headquarters by the Tamil Nadu Government following violence on Monday. After the violent clash between their supporters, the office was sealed to maintain “peace and tranquility” in the area.

మీరెవరు నన్ను తొలగించడానికి?.. నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా: పన్నీర్ సెల్వం

Posted: 07/12/2022 06:24 PM IST
Aiadmk tussle eps ops move madras high court against sealing of aiadmk office

తమిళనాడులోని విపక్ష అన్నాడీఎంకే పార్టీలో ఏకనాయకత్వ వ్యవహారంలో నిర్ణయం తేటతెల్లమైంది. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి స్వర్గీయ జయలలితకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న ఓ పన్నీరుసెల్వంకు.. అధినేత్రి లేని లోటు స్పష్టంగా అర్థమైంది. అధినేత్రి జయలలిత మరణం తరువాత నాలుగేళ్లకు ఆయనకు కూడా ఆ పార్టీతో బంధం తెగిపోయింది. ఒకింత భాదతప్త హృదయంతో తన అవేదనను వ్యక్తం చేయలేని ఆయన.. జయలలిత మరణం తరువాత ముఖ్యమంత్రిగా తాను అధిరోహించిన పీఠాన్ని నెంబర్ టు స్థానంలోని శశికళ అదేశాలపై ఎందుకు వదిలిపెట్టానా.? అన్న బాధ కూడా తప్పక ఉంటుంది.

ఈ పరిణామాలు చోటుచేసుకునేందుకు అసలు కారణం ఈ నెల 11న జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించడం. ఈపీఎస్‌ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో.. మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అంతేకాదు అదే సమావేశాల్లో పన్నీరు సెల్వం వర్గీయులను పార్టీ నుంచి బర్తరప్ చేయడం కూడా జరిగింది. వారినే కాదు స్వయంగా మాజీ మంత్రి పన్నీరు సెల్వం సహా ఆయన మద్దతుదారు నేతలను కూడా పార్టీ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

‘‘మీరెవరు నన్ను తొలగించడానికి.. నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా’’ ఈ మాటన్నది ఎవరో కాదు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం పళనిస్వామికి లేదని ఆయన తేల్చి చెప్పారు. నిన్న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయడంతోపాటు పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకున్నారు.

తనను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయడంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందించారు. తనను తొలగించేందుకు పళనిస్వామి ఎవరని ప్రశ్నించిన ఆయన.. తానే పళనిస్వామిని, సీనియర్ నేత కేపీ మునుస్వానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి తానే సమన్వయకర్తనని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిద్దరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. న్యాయం కోసం మళ్లీ కోర్టుకెళ్తానని చెప్పారు. మరి ఇప్పుడైనా పన్నీరు సెల్వానికి న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMk  Edappady K Palaniswami  O Panneerselvam  AIADMK General Council  Madras High Court  Jayalalithaa  Tamil Nadu Politicsతమిళనాడులోని విపక్ష అన్నాడీఎంకే పార్టీలో ఏకనాయకత్వ వ్యవహారంలో నిర్ణయం తేటతెల్లమైంది. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి స్వర్గీయ జయలలితకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న ఓ పన్నీరుసెల్వంకు.. అధినేత్రి లేని లోటు స్పష్టంగా అర్థమైంది. అధినేత్రి జయలలిత మరణం తరువాత నాలుగేళ్లకు ఆయనకు కూడా ఆ పార్టీతో బంధం తెగిపోయింది. ఒకింత భాదతప్త హృదయంతో తన అవేదనను వ్యక్తం చేయలేని ఆయన.. జయలలిత మరణం తరువాత ముఖ్యమంత్రిగా తాను అధిరోహించిన పీఠాన్ని నెంబర్ టు స్థానంలోని శశికళ అదేశాలపై ఎందుకు వదిలిపెట్టానా.? అన్న బాధ కూడా తప్పక ఉంటుంది. ఈ పరిణామాలు చోటుచేసుకునేందుకు అసలు కారణం ఈ నెల 11న జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించడం. ఈపీఎస్‌ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో.. మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అంతేకాదు అదే సమావేశాల్లో పన్నీరు సెల్వం వర్గీయులను పార్టీ నుంచి బర్తరప్ చేయడం కూడా జరిగింది. వారినే కాదు స్వయంగా మాజీ మంత్రి పన్నీరు సెల్వం సహా ఆయన మద్దతుదారు నేతలను కూడా పార్టీ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ‘‘మీరెవరు నన్ను తొలగించడానికి.. నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా’’ ఈ మాటన్నది ఎవరో కాదు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం పళనిస్వామికి లేదని ఆయన తేల్చి చెప్పారు. నిన్న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయడంతోపాటు పన్నీర్ సెల్వం  ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని ఎన్నుకున్నారు. తనను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయడంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందించారు. తనను తొలగించేందుకు పళనిస్వామి ఎవరని ప్రశ్నించిన ఆయన.. తానే పళనిస్వామిని  సీనియర్ నేత కేపీ మునుస్వానిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి తానే సమన్వయకర్తనని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిద్దరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. న్యాయం కోసం మళ్లీ కోర్టుకెళ్తానని చెప్పారు. మరి ఇప్పుడైనా పన్నీరు సెల్వానికి న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.  

Other Articles