Villagers turns potholes into Goa Beach మ‌ధ్య‌ప్ర‌దేశ్ రోడ్ల‌పై.. గోవా తరహా బీచ్ పార్టీ..!

Villagers indifferent protest against state government turning potholes into goa beach

Roads, Potholes, water loddged potholes, Annuppur Villages, Protest, Goa Beach Party, State Government, Madhya Pradesh, Viral Video, video Viral

In Madhya Pradesh (People turn potholes in Goa beach viral video), some people have found a unique way to party. He had a party sitting in water filled with potholes in protest against the state government negligence.

ITEMVIDEOS: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రోడ్ల‌పై.. గోవా తరహా బీచ్ పార్టీ..! ఇదో వెరైటీ నిర‌స‌న.!!

Posted: 07/05/2022 06:59 PM IST
Villagers indifferent protest against state government turning potholes into goa beach

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే వరణుడు బీభత్సాన్ని సృష్టించాడు. అసోం రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపటడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుణుడా.. కరుణించవా.? అని ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వరుణుడు పలకించగా, భూమి పులకరించింది. రైతన్న తన వ్యవసాయ పనులను ప్రారంభించాడు. అయితే వరుణుడు ఎక్కువగా ప్రేమ చాటుకున్న రాష్ట్రాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ కూడా ఉంది. అయితే వరుణుడి ధాటికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. అయినా స్థానిక అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించి రోడ్లను బాగు చేయడం లేదు. దీంతో మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామస్థులు రోడ్ల‌పై గోవా స్టైల్ బీచ్ పార్టీ ఏర్పాటు చేశారు.? ఏంట‌ది.. రోడ్లపై బీచ్ పార్టీనా.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇది అక్క‌డి ప్ర‌భుత్వంపై ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు తెలిపిన వెరైటీ నిర‌స‌న‌. గుంత‌ల‌మయ‌మైన రోడ్లను గ్రామ‌స్తులు గోవా బీచ్‌గా మార్చేశారు. అందులో కుర్చీలేసుకొని పార్టీ చేసుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వారు నెట్టింట్లో పోస్టు చేశారు. అంతే అవి కాస్తా వైర‌ల్‌గా మారింది. ప్రభుత్వానికి ఇలా కూడా నిరసనలు తెలుపవచ్చా.? అన్నట్లుగా ఇవి వైరల్ అయ్యాయి. ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ గ్రామంలో చిత్రీక‌రించారు. వ‌ర్షంధాటికి రోడ్డుపై పెద్ద గుంత ఏర్ప‌డి నీళ్లు నిలిచిపోయాయి. అందులో కొంద‌రు గ్రామ‌స్తులు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. గోవా స్టైల్‌లో టీ-షర్టులు, టోపీలు, క‌ళ్ల‌జోళ్ల‌తో క‌నిపించారు. కొంద‌రు మ్యూజిక్ వింటూ క‌నిపించ‌గా, మ‌రికొంద‌రు చేతుల్లో లిక్క‌ర్ బాటిల్స్ ప‌ట్టుకుని ఒక‌రిపై ఒక‌రు జోకులు వేసుకుంటూ పార్టీ చేసుకున్నారు. పాట‌లు పాడుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles