తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై చేసుకోవాలి. జులై 5కో చివరి తేదీగా ఉంది. ముగింపు సమయంలోపు అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ శాఖ తెలిపింది.
టీఎస్ఎస్పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్)లో 201 సబ్ ఇంజినీర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)/ డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
పోస్టుల పేరు - సబ్ ఇంజినీర్లు(ఎలక్ట్రికల్)
సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఎల్ఆర్ పోస్టులు: 19
సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) జీఆర్ పోస్టులు: 182
పే స్కేల్: నెలకు రూ. 88,665ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)/ డిప్లొమా (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)/ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగానే నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 15, 2022.
హాల్ టికెట్ల డౌన్లోడ్: జులై 23, 2022 నుంచి
రాత పరీక్ష తేదీ: జులై 31, 2022.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు: రూ.120
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏ లో మొత్తం 80 ప్రశ్నలు కోర్ టెక్నికల్ సబ్జెక్టు మీద ఉంటాయి. సెక్షన్ బి నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామ్ టైమ్ ను 2 గంటలుగా నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more