హిజ్రాలను చూస్తేనే కొందరు ఈసడించుకోగా, మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. ఇక వారు ఎదురుగా వచ్చి డబ్బులు అడిగితే.. లేవని సమాధానం చెప్పి పంపేవారి సంఖ్యే ఎక్కువ. కానీ వారిని కూడా సాధారణ మనుషులు లాంటివారేనని గుర్తించేవారి సంఖ్య చాలా తక్కువ. కానీ వారు మాత్రం ఎవరైనా అపదలో ఉన్నారన్నా.. లేక ఎవరికైనా సహాయం కావాలన్నా ముందుకు వచ్చి కల్పిస్తుంటారు. ఆపదలోని మహిళలకు ఆపన్నహస్తం అందించడంలోనూ వారు ముందుటారని ఈ ఘటన తెలియజేస్తోంది. బెంగుళూరులో ఓ యువతిపై ఒక దుండగుడి లైంగిక దాడి చేసేందుకు యత్నించగా.. యువతి అరుపులు విని హిజ్రాలు పరుగుపరుగున వెళ్లి కాపాడారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఈజీపురా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కేఆర్ పురంలోని వివేకనగర పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈశాన్య భారతంలోని మిజోరం రాష్ట్రానికి చెందిన యువతి బెంగళూరులో ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో నర్సింగ్ కోర్సు చేస్తోంది. అమె ఒక గదిలో ఒంటరిగా ఉంటోంది. ఈ విషయాన్ని అక్కడికి సమీపంలో హోటల్ లో పని చేస్తున్న పశ్చిమబెంగాల్ కు చెందిన మసురుల్ షేక్ పరిశీలించాడు. యువతిపై కన్నేశాడు. యువతిని వేధింపులకు గురిచేయాలని నిర్ణయించుకుని ప్రతి రోజు ఉదయం ఆ యువతి ఉంటున్న గది డోర్ బెల్ కొట్టి పారిపోయేవాడు.
విషయం తెలియని బాధితురాలు బెల్ మోగంగానే.. పక్కనే ఉంటున్న తన స్నేహితురాళ్లు వచ్చారనుకుని ఆమె బయటకు వచ్చి చూసేది. అయితే ఎవరూ కనపడకపోవడంతో తిరిగి లోపలకు వెళ్లిపోయేది. అలాగే క్రితం రోజు వేకువజామున కూడా నిందితుడు వచ్చి డోర్ బెల్ కొట్టగా, ఆమె తలపు తీసింది. వెంటనే గదిలోకి చొరబడిన నిందితుడు.. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దొంగగా భావించిన అమె అతనికి డబ్బులు, గొలుసు ఇస్తానని, ఏమీ చేయవద్దని ప్రాధేయపడింది. కానీ ముసరుల్ షేక్.. అమెపై లైంగిక దాడికి యత్నంచడంతో కేకలు వేసింది.
ఆ సమయంలో అమె ఉంటున్న గదికి మరోవైపున ఉన్న ఇద్దరు హిజ్రాలు యువతి అరుపులు విన్నారు. వేకువ జామున 3 గంటల సమయంలో యువతి అరుపులు విని వారు ఏదో జరిగిందని ఊహించి పరుగుపరుగున ఘటనాస్థలానికి వచ్చారు. అక్కడకు రాగానే యువతిపై లైంగిక దాడికి యత్నిస్తున్న ముసరుల్ షేక్ కు అడ్డగించారు. బాధితురాలిని నిందితుడి నుంచి తమ వైపుకు తీసుకున్నారు. అదే సమయంలో పక్కనే ఉంటున్న యువతి స్నేహితులు, స్థానికులు కూడా అక్కడకు వచ్చి నిందితుడికి దేహశుద్ది చేసి.. పోలీసులకు అప్పగించారు. యువతిని కాపాడిన హిజ్రాలను స్థానికులు, పోలీసులు ప్రశంసించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more