బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గల్ఫ్ దేశాలతో పాటు భారత్‌వ్యాప్తంగా నిరసనలకు కారణమైన నుపుర్ శర్మ.. దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఆందోళనలకు పూర్తి బాధ్యత నుపుర్ శర్మదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. సర్వత్రా నిరసనలకు దారితీశాయి. ఆ తర్వాత ఆమెపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
కాగా.. వాటన్నింటిని కలిపి ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు నుపుర్ శర్మ. తాజాగా.. వాటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. నుపుర్ శర్మ పిటిషన్‌ను తోసిపుచ్చింది. "ఆ డిబెట్‌ని(మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు) మేము చూశాము. ఆమె ఆ మాటలు చెప్పిన తీరు చాలా ఆందోళనకరంగా ఉంది. పైగా.. తనని తాను న్యాయవాదిగా ఆమె చెప్పుకుంటోంది. ఇది సిగ్గుచేటు. దేశం మొత్తానికి నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. మీరు(నుపుర్ శర్మ) ఇతరులపై ఎఫ్ఐఆర్లు వేస్తే.. వారిని వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు మాత్రం ఎవరికి ధైర్యం లేదు," అని అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో నుపుర్ శర్మ ప్రవర్తనపైనా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. "రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఉంటే ఏంటి? అధికారం తన వెనక ఉందని, దేశంలోని చట్టాలను గౌరవించకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని ఆమె అనుకుంటోందా?" అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలతో దేశంలోని ఓ వర్గం ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమె గ్రహించలేకపోయిందా.? లేక కావాలనే ఇలా వ్యాఖ్యలు చేసి.. దేశంలో అగ్గిరాజేసేందుకు యత్నించిందా.? అని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై స్పందించిన నుపుర్ శర్మ తరఫు న్యాయవాది.. టీవీ డిబెట్లో అడిగిన ప్రశ్నకు మాత్రమే ఆమె సమాధనం ఇచ్చిందని అన్నారు. ఫలితంగా సంబంధిత డిబేట్పైనా సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. టీవీ డిబేట్ నిర్వహించిన హోస్ట్పైనా కేసులు వేయాల్సింది అని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రజలకు మాట్లాడే హక్కు లేదని నుపుర్ శర్మ తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం మరింత ఆగ్రహాన్ని బయటపెట్టింది. "ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గడ్డికి పెరిగే హక్కు ఉంటుంది. గాడిదకు తిండి తినే హక్కు కూడా ఉంటుంది," అని జస్టిస్ సూర్య కాంత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more