రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 69ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అదేశాలను జారీ చేసింది. టికెట్ల విధానంపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థతరాలను పక్కకునెట్టి.. రాష్ట్రంలోని సామాన్యులకు అందుబాటు ధరలో సినిమా టికెట్ లభించేలా చేయాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
ఆన్లైన్ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులో సవాల్ చేశాయి.
బుక్ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని వాదించారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్ ధర ఎక్కువ ఉంటుందన్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు.
పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. దీంతో ఇక సినిమాలను ఎలా నడిపిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వేసిన ఈ పిటిషన్లపై వేర్వురుగా వాదనలు విన్న న్యాయస్థానం... జూలై 1న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more