హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. నగరవాసులు అవసరం అయితే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమవారం నుంచి నగరవాప్తంగా ముసురు పడుతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి మాత్రం విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి అనవసరమైన ఇబ్బందుల పడోద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంచింది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్, నెరేడ్మెట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 10 | లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు... Read more
Aug 10 | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల... Read more
Aug 10 | వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. ఇప్పటివరకు మనకు ఏనుగులు, చిరుతలు, పెద్దపులులు, మొసళ్లు ఇలాంటి వన్యమృగాలు మాత్రమే జనవాసాల్లోకి వచ్చిన విషయం తెలుసు. కానీ దట్టమైన... Read more
Aug 10 | దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల... Read more
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more