తిరుమల శ్రీవారి భద్రతకు అత్యాధిునికంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమలకు కరోనా మహమ్మారి తరువాత భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో అటు భక్తులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు భద్రత కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మారుతున్న సాంకేతికత నేపథ్యంలో అత్యంతాధునిక సాంకేతికతతో కూడిన భద్రతను కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరగడంతో పాటు రకరకాల శక్తుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శ్రీవారి భద్రతకు వాడుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ భద్రతా వ్యవహారాల్లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రత కోసం అత్యాధునికి రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలకు ఔటర్ రింగ్ రోడ్డు యాక్సెస్ కంట్రోల్‌తో పాటు ఘాట్ రోడ్డులో సిసిటివి ప్రాజెక్టు, తిరుమల ఆలయంతో పాటు, బూందీపోటులో నైట్రోజన్ లిక్విడ్ కార్పెట్ల ఏర్పాటు, అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఫేజ్ 3లో భాగంగా సిసిటివిల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తిరుమలలో ముఖ్యమైన ప్రదేశాల్లో స్మార్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. బాంబ్ డిస్పోజల్ ఉపకరణాలను సమకూర్చుకుంటారు. స్పీడ్ రికార్డింగ్ కెమెరాలు, స్పీడ్ గన్స్ కొనుగోలు చేస్తారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ ఏర్పాటు చేస్తారు. ఆభరణాల రవాణాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేస్తారు. టీటీడీలో ప్రత్యేక భద్రత వ్యవస్థ 1974లో ప్రారంభమైంది. డిఎస్పీ స్థాయి అధికారితో తిరుమలలో భద్రత ఏర్పాట్లను ప్రారంభించారు. 1984నాటికి తిరుమలలో భద్రతా వ్యవహారాల కోసం ఐపిఎస్ స్థాయి అధికారితో విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలిపిరిలో 2003లో జరిగిన బాంబు దాడి తర్వాత తిరుమలలో భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం తిరుమలలో భద్రతా విధుల కోసం పెద్ద ఎత్తున సివిల్ పోలీసుల్ని వినియోగిస్తున్నారు. తిరుమల కొండలపై నిరంతరం సాయుధ బలగాల పహారా కొనసాగుతుంది. దాదాపు 23వేల మంది టీటీడీ ఉద్యోగులతో పాటు నిత్యం స్వామి వారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను టీటీడీ భద్రతా విభాగం పర్యవేక్షిస్తుంది.రోజురోజుకు భక్తుల తాకిడితో పాటు విఐపిల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడం సాధ్యమయ్యే పనికాకపోవడంతో భద్రతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు... Read more
Aug 10 | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల... Read more
Aug 10 | వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. ఇప్పటివరకు మనకు ఏనుగులు, చిరుతలు, పెద్దపులులు, మొసళ్లు ఇలాంటి వన్యమృగాలు మాత్రమే జనవాసాల్లోకి వచ్చిన విషయం తెలుసు. కానీ దట్టమైన... Read more
Aug 10 | దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల... Read more
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more