Fishermen Come Across 100-YO Giant White Sturgeon మీరెప్పుడైనా వందేళ్లకు పైగా వయస్సున్న చేపను చూశారా..

Fishermen come across 100 yo giant white sturgeon in canada release it back after catching it

white sturgeon, fisherman, fishermen, massive fish, freshwater fish, north america, white sturgeon, fish, canada, british columbia, viral video, 100-year-old fish, Fishermen, Fraser River Sturgeon Conservation Society, River Monster Adventures

A video of the fishermen catching the fish was shared on Facebook, and part of its caption read, “The sturgeon jumped out of the water multiple times, and that’s when they realized how big this dino actually was." The sturgeon measured 10 feet and one inch long and had a girth of 57 inches.

మీరెప్పుడైనా వందేళ్లకు పైగా వయస్సున్న చేపను చూశారా..

Posted: 06/27/2022 08:57 PM IST
Fishermen come across 100 yo giant white sturgeon in canada release it back after catching it

భూమిపై ఉండే అన్ని జీవులను మనం ఎలాగైతే చూసిఉండమో.. అదే విధంగా జలంలోని జీవాలను కూడా మనం అన్నింటినీ చూసిఉండము. అయితే అవి అక్కడక్కడా బయట పడిన సందర్భాల్లో మాత్రం వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ నెలకొంటుంది. మనకు తెలిసి ఏళ్లకు ఏళ్లుగా బతికి ఉండే జీవరాశుల్లో చెట్టు, కొన్ని జంతువులు మాత్రమే తెలుసు. కానీ ఒక రకం చేపలు కూడా అలా జీవిస్తాయని తెలుసా.? శతాధికంగా జీవించే చేపలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇదిదో ఇది వందేళ్ల వ‌య‌స్సున్న లైవ్ ఫిష్‌ ( అంటే ఇప్పటికీ సజీవంగానే ఉంది).

వందేళ్లకు పైబడిన చేప.. సజీవంగా ఉంది అంటే వినడానికే విచిత్రంగా ఉన్నా.. దానిని పట్టుకున్న మత్స్యకారులు.. ఫోటోలు, వీడియోలు తీసి.. తరువాత దానిని సురక్షింతంగా నీటిలోకి వదిలిపెట్టారు. దీనిని పట్టుకుని తమ పడవలో వేసేందుకు వారు ఏకంగా మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఎందుకుంటే ఇది ఏకంగా 371 కిలోల బరువుందని మత్స్యకారులు తెలిపారు. కెన‌డాలో ఇటీవ‌ల మొద‌ట‌సారిగా దొరికింది. ఈ భారీ చేప‌ను బ్రిటీష్ కొలంబియాలో మ‌త్స్య‌కారులు మొద‌టిసారిగా ప‌ట్టుకున్నారు. దీని పొడ‌వు ప‌ది అడుగుల కంటే ఎక్కువ‌గా ఉంది. దీని చుట్టుకొల‌త 57 అంగుళాలు. దీని వ‌య‌స్సు వందేళ్ల ఉంటుంద‌ని వారు అంచ‌నా వేశారు.

ఈ భారీ చేప ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ చేప‌ను లిలూయెట్, బీసీ సమీపంలో స్టీవ్ ఎక్‌లండ్, మార్క్ బోయిస్ అనే మ‌త్స్య‌కారులు ప‌ట్టుకున్నారు. ఈ చేప‌ను తమ పడవలోకి ఎక్కించేందుకు వారు దాదాపు రెండు గంట‌లు కుస్తీప‌ట్టారు. ఇది దాదాపు 371 కిలోలు ఉంటుంద‌ని స్టీవ్ ఎక్‌లండ్ పేర్కొన్నాడు. ఈ చేప పేరు స్ట‌ర్జ‌న్. అసిపెన్సెరిడే కుటుంబానికి చెందిన 27 జాతుల చేపలకు స్ట‌ర్జ‌న్ అనేది సాధారణ పేరు. వైట్ స్టర్జన్ ఉత్తర అమెరికాలో అతిపెద్ద మంచినీటి చేప. 14 అడుగుల పొడవు, 1,500 పౌండ్ల‌ వరకు బరువుంటుంది. ఈ చేప‌లు 150 ఏళ్ల వ‌ర‌కు జీవించ‌గ‌ల‌వ‌ని ఫ్రేజర్ రివర్ స్టర్జన్ కన్జర్వేషన్ సొసైటీ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles