Supreme Court rules Arya Samaj's marriage certificate invalid `మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను ఆర్య‌స‌మాజ్ ఇవ్వ‌డ‌మేంటి?`: సుప్రీంకోర్టు

Arya samaj has no business to issue marriage certificate says supreme court

Supreme Court', Arya Samaj, marriage certificate, Justice Ajay Rastogi, Justice BV Nagarathna, counsel counsel, rejected submission, major girl, marriage, Government authorities, Advocate Rishi Matoliya, Madhya Pradesh High Court, Padukalan Police Station, Nagaur, Madhya Pradesh, Crime

The Supreme Court Friday said that 'Arya Samaj' has no business to issue marriage certificates and rejected a bail plea of an accused booked for kidnap and rape of a minor girl. A vacation bench of Justices Ajay Rastogi and BV Nagarathna rejected the submission of the counsel for the accused that the girl is a major and they have married in an 'Arya Samaj' temple and a marriage certificate is on record.

`మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను ఆర్య‌స‌మాజ్ ఇవ్వ‌డ‌మేంటి?`: సుప్రీంకోర్టు

Posted: 06/04/2022 08:00 PM IST
Arya samaj has no business to issue marriage certificate says supreme court

ఆర్య‌స‌మాజ్.. ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ. ఈ సమాజం హిందూ మ‌త సంస్క‌ర‌ణ సంస్థ‌ ఏర్పడింది. హిందువులు అందరూ ఓక్కటే అన్న సంస్కరణ చేపడుతున్న ఈ సంస్థ ప్రేమికులు చాలా బాగా పరిచయం. అయితే ఈ సమాజం.. మేజర్లయిన యువతీ యువకులకు వారి పెద్దల అంగీకారం లేకుండానే వారు ఇష్టపడిన వ్యక్తితో వివాహం చేస్తారు. అలా వివాహాలు చేయడంతో పాటు వీరిద్దరూ భార్యభర్తలు అంటూ ఆ సమాజం ఏకంగా వివాహ ధృవపత్రిం కూడా జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్య సమాజ్ జారీ చేసే మ్యారేజ్ సర్టిపికేట్ చెల్ల‌వ‌ని తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను ఆర్య‌స‌మాజ్ అనే సంస్థ ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించింది. ఆర్య‌స‌మాజ్ జారీ చేసిన పెళ్లి స‌ర్టిఫికెట్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. వివాహ ధృవ‌ప‌త్రాల‌ను జారీచేసే అధికారం ఆర్య‌స‌మాజ్ కు లేద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఏ ర‌స్తోగి, జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న స్ప‌ష్టం చేశారు. ఆర్య‌స‌మాజ్ ప‌ని వివాహ స‌ర్టిఫికెట్లు జారీ చేయ‌డం కాద‌న్నారు. మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను జారీ చేయ‌డానికి చ‌ట్ట‌బ‌ద్ధ విభాగాలున్నాయ‌ని గుర్తు చేశారు. ఆర్య స‌మాజ్ ను స్వామి ద‌యానంద స‌ర‌స్వ‌తి హిందూ మ‌త సంస్క‌ర‌ణ సంస్థ‌గా 1875లో స్థాపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఒక ప్రేమ పెళ్లికి సంబంధించిన కేసు విచార‌ణ‌లో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో త‌మ కూతురిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడ‌ని ఒక వ్య‌క్తిపై అమ్మాయి కుటుంబ స‌భ్యులు కేసు పెట్టారు. త‌మ కూతురు మైన‌ర‌ని, అందువ‌ల్ల అత‌డిపై ఐపీసీతో పాటు చిన్నారుల‌పై లైంగిక నేరాల నిరోధ‌క చ‌ట్టం(పొక్సొ)కింద కేసు న‌మోదు చేసి, శిక్ష విధించాల‌ని కోరారు. ఈ వాద‌న‌ను ఆ యువ‌కుడు తోసిపుచ్చాడు. ఆ యువ‌తి మేజ‌ర్ అని, త‌న ఇష్టంతోనే ఆర్య‌స‌మాజ్‌లో పెళ్లి చేసుకున్నామ‌ని వాదించాడు. అందుకు సాక్ష్యంగా సెంట్ర‌ల్ భార‌తీయ ఆర్య ప్ర‌తినిధి స‌భ జారీ చేసిన వివాహ ధృవ‌ప‌త్రాన్ని చూపించాడు. అయితే, ఈ స‌ర్టిఫికెట్‌ను సుప్రీంకోర్టు అంగీక‌రించ‌లేదు. చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ జారీ చేసిన ఒరిజిన‌ల్ మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను త‌మ ముందుంచాల‌ని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles