SC junks petitions seeking stay on Jagannath Temple Corridor project పిటీషన్ దారులకు లక్ష చోప్పున పెనాల్టీ వడ్డించిన ‘సుప్రీం’

Sc dismisses pleas against redevelopment project at jagannath puri temple fines petitioners

Supreme Court, parikrama project of Jagannath Puri Temple, Jagannath Puri Temple, Jagannath Puri Temple redevelopment project, Puri Heritage Corridor, Supreme Court on Puri Heritage Corridor, Puri Heritage Corridor, Puri, Puri Jagannath temple, odisha

The Supreme Court dismissed two PILs related to a renovation project around Puri’s Jagannath Temple and imposed Rs 1 lakh fine on the petitioners for “frivolous litigation”. The court has also lamented the “mushrooming” of public interest litigations which are "not in the public interest".Two petitions- by persons claiming to be devotees of the Jagannath Temple had been filed which had challenged the proposed renovations at the temple premises.

ఆ పిటీషన్ దారులకు లక్ష చోప్పున పెనాల్టీ వడ్డించిన ‘సుప్రీం’

Posted: 06/03/2022 07:10 PM IST
Sc dismisses pleas against redevelopment project at jagannath puri temple fines petitioners

అభివృద్ది అంశంలో అవరోధాలు కల్పించడమే పనిగా పెట్టుకుని న్యాయపోరాటాల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్న కోందరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తగిన పాఠం నేర్పించింది. అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకుని కోర్టుల్లో పిటీషన్ వేస్తున్న ఇద్దరు పిటీషనర్లకు అత్యున్నత న్యాయస్థానం ఏకంగా లక్ష రూపాయల మేర వడ్డింపులు వడ్డించింది. దీంతో పిటీషన్ వేయడమే ఖర్చుతో కూడకున్న పనికగా, ఇప్పుడు లక్ష రూపాయల జరిమానా తమపై పడటంతో ఇకపై పిటీషన్లు వేసి అభివృద్ది పనులను ఆపాలని ప్రయత్నాలు చేసేవారికి ఇది చెంపపెట్టులాంటి తీర్పుగా మారింది.

ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పూరి జ‌గ‌న్నాథ ఆల‌యం వ‌ద్ద చేప‌డుతున్న నిర్మాణాల‌ను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటీషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒడిశా ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ట్లు నిర్మాణ ప్ర‌క్రియ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్థ‌మే జ‌రుగుతోంద‌ని సుప్రీం తెలిపింది. పూరి ఆల‌యం వ‌ద్ద నిర్మాణ ప‌నుల‌ను నిలిపాల‌ని వేసిన పిటిష‌న్ల‌ను సుప్రీం కొట్టిపారేసింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. పూరి ఆల‌యానికి ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటార‌ని, వారికి క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం ప్ర‌భుత్వ విధి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది.

అలాంట‌ప్పుడు ఆ నిర్మాణాన్ని ఆపేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేమ‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. అన‌వ‌స‌ర‌మైన పిల్స్‌ను దాఖ‌లు చేయ‌రాదు అని కోర్టు సీరియ‌స్ అయ్యింది. ప్ర‌తి రోజు 60 వేల మంది భ‌క్తులు ఆల‌యాన్ని విజిట్ చేస్తార‌ని, అక్క‌డ అధిక సంఖ్య‌లో టాయిలెట్ల‌ను నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ అశోక్ కుమార్ ప‌రిజా కోర్టులో వాదించారు. సంస్కృతి శాఖ అనుమ‌తితోనే నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు. నేష‌న‌ల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ) ప్ర‌కార‌మే నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మైన‌ట్లు చెప్పారు. నిర్మాణాల‌ను వ్య‌తిరేకిస్తూ పిటిష‌న్ వేసిన ఇద్ద‌రికీ చెరో ల‌క్ష చొప్పున కోర్టు జ‌రిమానా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles