AP Minister Son Krishna Reddy threatens MPTC; Audio Leak వైసీపీ ఎంపీటీసీని బెదిరించిన మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణరెడ్డి

Ap minister pinipe vishwaroop son krishna reddy threatens mptc audio leak

Konaseema Zilla Sadhana Samithi,Chandrababu Naidu, Dr BR Ambedkar, Konaseema, Nara Lokesh, Telugu Desam Party TDP, YSRCP, Minister Vishwaroop, Mummadivaram MLA, Ponnada Satish Kumar, Andhra Pradesh, Politics

The audio of Minister Vishwaroop's son Krishnareddy's threatening threats has gone viral. Minister's son Krishnareddy threatened YCP MPTC Adapa Sattibabu. "Will you stick to my house ... I will kill you," the minister's son threatened. It is learned that a case has been registered against YCP MPTC Adapa Sattibabu in the Amalapuram riots case. However, the MPTC claimed that he was not involved in the incident but was joined by another faction in the YCP.

వైసీపీ ఎంపీటీసీని బెదిరించిన మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణరెడ్డి

Posted: 06/02/2022 04:01 PM IST
Ap minister pinipe vishwaroop son krishna reddy threatens mptc audio leak

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చుతూ జీవో విడుదల చేయడంతో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించేందుకు వస్తామని చెప్పిన పలువురు.. ఏకంగా 3500 మంది సమితి కార్యకర్తలు చేరుకుని విధ్వంసం సృష్టించారు. మంత్రి విశ్వరూప్.. ఎమ్మెల్యే సతీష్ లకు చెందిన నివాసాలను దగ్ధం చేశారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంపై రాజుకున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి.

దీంతో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల సమస్య తలెత్తి.. కర్ప్యూలు విధించాల్సిన పరిస్థుతులు ఉత్పన్నమయ్యాయి. ఆ తరువాత అమలాపురంలో రాజుకున్న ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు భారీ సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా మోహరించి.. ఎక్కడికక్కడ ఆంక్షలను విధించడంతో పాటు 144 సెక్షన్, పోలీస్‌ యాక్ట్‌ 30ని అమలు చేయడంతో అల్లర్లను అదుపు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక అమలాపురం పట్టణంలో ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేసి ఎలాంటి ఉద్రేకపర్చే పోస్టులు ఆందోళనకారులకు చేరకుండా చేశారు. పోలీసుల చర్యల కారణంగా అక్కడ పరిస్థితులు అదుపెులోకి వచ్చాయి.

ఇదిలావుండే ఇప్పుడు మంత్రి విశ్వరూప్ ఇంటిని అందోళనకారులు దగ్ధం చేసిన ఘటనపై ఆయన తనయుడు కృష్ణారెడ్డి స్థానిక వైసీపీ నేతలకు ఇచ్చిన వార్నింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. తమకు చెందిన ఇంటిని పెట్రోల్ పోసి కాల్చేయడంతో ఆయన ఆగ్రహంగా అందుకు బాధ్యులైన వారిని బెదిరించారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డికి చెందిన బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి వైసీపి ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఐదు నిమిషాల వ్యవధిలో తన తల్లి తప్పించుకుందని తనకు ఏమైనా అయ్యివుంటే ఏవరు బాధ్యులంటూ ప్రశ్నిస్తూనే. ఎంపీటీసీపై తీవ్రపదజాలంతో ఆగ్రహాన్న వ్యక్తం చేశారు. తాను లేను అని అన్నా వినిపించుకోకుండా మంత్రి కుమారుడు.. రెండు కాళ్లు విరిచేస్తాను.. చంపేస్తాను అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అమలాపురంలో గత నెల 24న జరిగిన విధ్వంస ఘటనపై ఎంపీటీసీ సత్తిబాబుపై పోలీసులు.. కేసు నమోదు చేశారు. తమ ఇంటిని తగులబెడతారా అంటూ.. మంత్రి కుమారుడు అతడ్ని తీవ్ర స్థాయిలో బెదిరించారు. అసభ్య పదజాలంతో బూతులు తిట్టారు. వచ్చే రెండేళ్లలో నీ సంగతి చూస్తానంటూ... వైసిపీ ఎంపీటీసీని మంత్రి కుమారుడు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles