Woman swims to India from Bangladesh to marry lover టైగర్ రిజర్వును దాటి.. సముద్రాన్ని ఈది.. ప్రియుడ్ని చేరింది.. కానీ..

Bangladeshi woman swims across the river for love what follows next is exciting

Bangladeshi woman crosses border to marry indian guy, krishna mandal, Abhik Mandal, kolkatta, Facebook love, indian border, illegally crossing border, bangladeshi woman sundarbans, indian boyfriend, Bangladesh woman braves Sundarbans, Bangladesh woman swims for an hour, Bangladesh woman marry love of her life in India, Bangladeshi woman crosses border to marry Indian man, arrested

A 22-year-old Bangladeshi woman swam across the border to marry her boyfriend from India. She braved the wild forests of the Sunderbans, swam for an hour and entered India to unite with the love of her life. The Bangladeshi woman, identified as Krishna Mandal, met Abhik Mandal on Facebook and fell in love. As Krishna did not have a passport, she chose to cross the border illegally.

ప్రేమంటే ఇదేరా: టైగర్ రిజర్వును దాటి.. సముద్రాన్ని ఈది.. ప్రియుడ్ని చేరింది.. కానీ..

Posted: 06/02/2022 01:55 PM IST
Bangladeshi woman swims across the river for love what follows next is exciting

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అంటూ కొందరు మోసపోయిన ప్రేమికులు తమకు ఆ పాటను అన్వయించుకుంటారు. అయితే ఏ పాట చూసినా అబ్బాయిలకు పరిపోయేలా ఉంటాయే కానీ.. అమ్మాయిలు సొంత చేసుకునేలా మాత్రం ఉండవు. మగవారి చేతిలో ఎందరో అమ్మాయిలు మోసపోయినా.. కాలం కాటువేసింది.. విధి వంచించింది.. అంటారే కానీ.. ప్రేమకోసం బలైపోయిందే అంటూ మాత్రం పాటలు రాలేవు. పాటలు ఉంటేనేం.. లేకపోతేనేం.. ప్రేమ కోసం సాహసాలు చేయాల్సిన జాబితాలో కేవలం యువకులు మాత్రమే ఉండాలా.? యువతులకు అవకాశమే లేదా.? అని ప్రశ్నించేట్లుగా ఉంది ఈ యువతి సాహసం.

అంతేకాదు.. ప్రేమించుకుని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అనగానే విడిపోదాం అనుకునేవారికి కూడా ఈ యువతి ప్రేమ కోసం చేసిన సాహసం ఒక ప్రేరణ. ప్రేమ కావాలా.? ప్రాణం కావాలా.? అంటే ప్రేమే లేకపోతే ప్రాణం ఉన్నా ఎందుకు.? అన్నట్లుగా ఉంది ఈ యువతి సాహసం. ఇంతకీ అమె చేసిన ఆ సాహసమేంటి అంటే..? ఏకంగా మన దేశం కాదు.. పోరుగునున్న బంగ్లాదేశ్ కు చెందిన యువతి అమె. అమె పేరు కృష్ణా మండల్. అమెకు ఫేస్ బుక్ ద్వారా ఓ భారత దేశానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రణయంగా మారింది. ఈ ప్రయణం పరిణంగా మార్చుకుందామని ఇద్దరూ అనుకున్నారు.

తన ప్రేమను దక్కించుకునేందుకు అధికారికంగా భారత దేశానికి వీసా పెట్టుకుని.. అనుమతి మేరకు వచ్చేందుకు అమె వద్ద పాస్ పోర్టు, వీసా లేదు. దీంతో దొడ్డిదారిన కష్టపడితే భారత్ కు చేరుకోవచ్చునని అమె భావించింది. ఇందుకోసం వాకాబు కూడా చేసింది. అయితే అమె వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనదని.. ఈ దారిలో టైగర్ రిజర్వు.. పెద్దపులులు కూడా సంచరించే అడవి ఉందని తెలిసినా అమె వెనకడుగు వేయలేదు. అంతేకాదు ఏకంగా ఒక గంట పాటు నీటిని ఈదుకుంటూ వెళ్లాల్సి వస్తుందని తెలిసినా.. అమె గంటేకదా.. అని భావించింది. అంతే ప్రయాణానికి సిద్దమైంది.

అనుకున్నదే తడవుగా ప్రాణాలను పణంగా పెట్టి రాయల్ బెంగాల్ పులులు తిరుగాడే సుందర్‌బన్ అడవిలోకి ప్రవేశించింది. ఓ వైపు పెద్దపులు ఎక్కడ మాటువేసాయా అని అమె కళ్లు అన్వేషిస్తూనే మరో వైపు వేగంగా నడుస్తూ అడవిని దాటేసింది. ఆ తర్వాత అమె మరో సాహసం చేయాల్సి వచ్చింది. ఏకంగా సముద్రాన్నే ఈదాట్సి వచ్చింది. అయినా మొక్కవోని ధైర్యంతో అమె సముద్రంలోకి దూకి గంటపాటు ఈదుకుంటూ పశ్చిమ బెంగాల్‌ భూభాగంపై అడుగుపెట్టింది. ఇలా అమె తన ప్రేమను దక్కించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. మరి ఇప్పుడు అమె ప్రేస్ బుక్ ప్రండ్ ఏమన్నాడు. పెళ్లికి అంగీకరించాడా.? అంటే..

పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కత్తాలోని కాళీమాత ఆలయానికి చేరుకుంది. తన సోషల్ మీడియా సౌజన్యంతో అమె నేరుగా తన ప్రియుడి అభిక్ మండల్ కు సమాచారం అందించింది. దీంతో అమె బాయ్ ప్రెండ్ కూడా అమెతో పెళ్లికి అంగీకరించాడు. వీరిద్దరికీ మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీమాత ఆలయంలో వివాహం జరిగింది. తన భర్త అభిక్ మండల్‌తో మూడుముళ్లు వేయించుకున్న సంతోషం అమెకు కొన్ని గంటలు మాత్రమే పరిమితం అయ్యింది. అదేంటి పెళ్లే జరిగిందీ.. ఇక అభ్యంతరాలు.. ఏమున్నాయ్.. వారు హ్యాపీగా సంపారం చేసుకుంటారు.. అని అనుకుంటే పోరబాటే.

అయితే, కథలో అసలు ట్విస్టు వచ్చింది. కృష్ణ మండల్ సాహసగాథ ఆ నోటా ఈ నోటా పాకి.. చివరికి పోలీసులకు చేరింది. దీంతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి అప్పగించాలని నిర్ణయించారు. అయితే తన భర్తను కాదని తాను రాలేనని అమె చెప్పినా.. బంగ్లాదేశ్ రాయభార కార్యాలయంలో అప్పగించిన తరువాత వారు అధికారికంగా మిమల్ని భారత్ కు పంపించే ఏర్పాట్లు చేస్తారని పోలీసులు అమెకు చెప్పడంతో అంగీకరించింది. ఎంతో సాహసం చేసి బెంగాల్ టైగర్లను దాటుకుని.. సముద్రాన్ని ఈది తన ప్రమేతో బంధాన్ని ఏర్పర్చుకున్నా.. అక్రమ మార్గం కాదని.. అధికారమార్గంతో రావాలని అమెను బంగ్లాదేశ్ కు పంపించారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles