Petrol dealers stage one- day protest today కమీషన్ పెంచాలని.. నిరసనబాట పట్టిన పెట్రోల్ బంకు డీలర్లు

No purchase by petrol pump dealers today in demand of higher commission

petrol pump dealers, petrol dealers association, fuel no purchase, petrol no purchase, diesel no purchase, protest, increase of commission, Oil companies, Indian Oil, Hidustan Petroleum, Bharat petroleum, Maharashtra

A petrol pump dealers’ association will on Tuesday resort to ‘no purchase of petrol and diesel’ in protest against no increase in their commission by the oil marketing companies, but the protest is unlikely to disrupt supplies as fuel bunks have enough stocks to last couple of days.

కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. నిరసనబాట పట్టిన పెట్రోల్ బంకు డీలర్లు

Posted: 05/31/2022 04:50 PM IST
No purchase by petrol pump dealers today in demand of higher commission

దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్​ పంప్​ డీలర్లు మంగళవారం నిరసనబాట పట్టారు. నిన్నమొన్నటి వరకు ఆకాశానంటిన ఇంధన ధరల నేపథ్యంలో అల్లాడిపోయిన వాహనదారులు.. ఇప్పుడు తాజాగా పెట్రోల్ బంకు డీలర్ల నిరసనలతో ఇక్కట్లు ఎదుర్కోన్నాడు. ఇవాళ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకుచెందిన పెట్రోల్ బంకు డీలర్లు ఇంధనాన్ని కోనుగోలు చేయకుండా నిరసన చేపట్టారు. అయితే దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభ్యం కాక వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఈ మేరకు ఒక్క రోజు.. ఓఎమ్​సీ(ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు)ల నుంచి పెట్రోల్​, డీజిల్​ కొనుగోలు చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు.

దీంతో తమ నిరసనను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయాలని ముందుగానే వారు నిర్ణయించుకున్నారు. ఈ నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు వాహన దారులు ఇంధనం లభించక ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్​ పంప్​ల డీలర్లకు ఇచ్చే కమిషన్​ను పెంచకపోవడంతో పెట్రోల్​ పంప్​ డీలర్స్​ అసోసియేషన్​ ఈ మేరకు నిరసనలు చేపట్టింది. 24 రాష్ట్రాల్లోని పెట్రోల్​ పంప్​లు ఈ నిరసనల్లో పాల్గొంటాయని అసోసియేషన్​ వెల్లడించింది. అయితే.. పంప్​లలో ఇప్పటికే పెట్రోల్​, డీజిల్ స్టాక్​​ కావాల్సినంత మేర ఉండటంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వెల్లడించింది.

"మంగళవారం.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన ఒక్క పెట్రోల్​ పంప్​ కూడా ఓఎమ్​సీ నుంచి చమురును కొనుగోలు చేయదు. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతున్నా, మా కమిషన్​ను మాత్రం పెంచడం లేదు. అందుకే ఈ నిరసన," అని ఢిల్లీ పెట్రోల్​ డీలర్స్​ అసోసియేషన్​ పేర్కొంది. అసోసియేషన్​ ప్రకారం.. డీలర్ల మార్జిన్లను ఓఎమ్​సీ ప్రతి ఆరు నెలలకు ఓసారి రివైజ్​ చేయాలి. కానీ 2017 నుంచి కమిషన్లలో మార్పులు లేవు. అదే సమయంలో చమురు ధరలు, ఆపరేషన్​ వ్యయం భారీగా పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశప్రజలకు కాస్త ఉపసమనాన్ని అందించే విధంగా.. పెట్రోల్​, డీజిల్​ ధరలను కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే.

 లీటరు పెట్రోల్​పై రూ. 8, లీటరు డీజిలపై రూ. 6ను తగ్గించింది. కాగా.. పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమపై మరింత భారం పడిందని అసోసియేషన్​ ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్​, హరియాణా, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్​ప్రదేశ్​, బిహార్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కేరళ, అస్సాం, మేఘాలయా, అరుణాచల్​ప్రదేశ్​, నాగాలాండ్​, మణిపూర్​, మిజోరాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ్​ బెంగాల్​ రాష్ట్రాల్లోని పెట్రోల్​ పంప్​లు.. ఈ నిరసనల్లో పాల్గొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles