watch the little elephant's battle with a goose భయం అవహిస్తే.. చిన్న పక్షిని చూసి.. గజగజలాడిన ఏనుగు

This elephant s battle with a goose will leave you in splits

elephant, viral elephant video, viral animal video, elephant vs goose, elephant battles goose, trending stories, viral videos

The internet is a reservoir of videos that feature animals fighting it out with each other in a hilarious manner. The latest to join the crowd is a video of an elephant engaged in a battle with a goose, which will surely leave you in splits. The clip starts with a young jumbo trying to shoo away a goose by sprinkling water on it.

ITEMVIDEOS: భయం అవహిస్తే.. చిన్న పక్షిని చూసి.. గజగజలాడిన ఏనుగు

Posted: 05/31/2022 03:53 PM IST
This elephant s battle with a goose will leave you in splits

ఆరడుగుల మనిషి అంగుల వెడల్సు వున్న బొద్దింకను చూసి భయపడి పెద్దగా కేకలు వేయడం చూశాం. మూడంగుళాల వెడల్పు వున్న ఎలుక, లేదా బల్లిని చూసి భయపడి ఇల్లు పీకి పందిరేసినంత పనిచేస్తారు. అంతేగా మరి మనసులో భయం అవహించి ఉంటే చిన్న చీమను చూసినా భయపడిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ చిన్నారి ఏనుగు పిల్లలోనూ భయం అవహించింది. అందుకనే దానిని అక్కడి నుంచి తరిమేయాలని భావించింది. అయితే ఏనుగు భయపడినంతా పని జరిగింది. ఎందుకిలా.? ఎం జరిగిందీ.? అన్న వివరాల్లోకి వెళ్తే..,

నదిలో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఏనుగు పిల్లకు ఓ పక్షి కనబడింది. అయితే ఈ పక్షితో గతానుభవం ఉందో లేక ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురుకాగా చూసిందో తెలియదు కానీ.. పక్షిని చూడగానే తనకు దీనితో ఎక్కడ ఏలాంటి ప్రమాదం వస్తుందోనని భయపడింది. అంతే తాను నీళ్లు తాగే సమయంలో అదెక్కడ తనపైవాలి.. తన ముక్కుతో తన వీపును పొడుస్తుందోనని భావించిందో ఏమో తెలియదు కానీ దానిన అక్కడి నుంచి తరిమేసి తాపీగా నీళ్లను తాగాలని భావించింది. ఇక మరుక్షణం ఆలస్యం చేయకుండా పక్షిని అక్కడి నుంచి పంపిచేసేందుకు ప్రయత్నాలు చేసింది.

తన తొండంతో నీటిని తీసుకుని పక్షిపై చల్లేందుకు ప్రయత్నించింది. అయినా అక్కడి నుంచి పక్షి కదల్లేదు. దీంతో అలా వెనుదిరిగిన ఏనుగుపై పక్షి ఎగురుకుంటూ వచ్చి వాలిది. దీంతో తాను భయపడినట్లే జరిగిందనుకున్న ఏనుగు వెంటనే దానిని వీపు పై నుంచి తరమింది దీంతో అది కాస్తా కిందకు వచ్చింది. అదే అదనుగా భావించిన ఏనుగు పక్షిని కాలితో తన్నింది. పక్షి తప్పించుకుంది. దీంతో మరో కాలితో దానిని తన్నగా దానికి తగిలినా..సకాలంలో తప్పించుకోగలిగింది. దీంతో ఏనుగును ఫక్షి ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో నదిలో నీళ్లుకు బదులుగా అది పక్షిని తరిమేందుకే సమయాన్ని వెచ్చించి ఆయాసపడింది.

ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీస‌ర్ దీపాన్షు కాబ్ర ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో న‌దిలో నీళ్లు తాగుతున్న ప‌క్షిపై ఓ పిల్ల ఏనుగు నీళ్లు చ‌ల్లుతూ టీజ్ చేస్తుంది. అనంత‌రం ఏనుగు వెళ్లిపోతుండ‌గా ప‌క్షి వెంట‌ప‌డి మ‌రీ దాన్ని పొడుస్తుంది. ‘త‌మ‌కంటే చిన్న‌స్థాయివారిని చిన్న‌చూపు చూడ‌డ‌మంటే అది తెలివిత‌క్కువ‌ త‌న‌మే. ఈ ప‌క్షిలాగా ఏనుగును ఉరికించే స‌త్తా అంద‌రికీ ఉంటుంది.’ అని దీపాన్షు ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్షా 83వేల మంది వీక్షించ‌గా, 1,300 మంది లైక్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles