Punjab minister arrested after CM Bhagwant Mann sacks him పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి బర్తరప్.. అరెస్టు

Punjab minister sacked by bhagwant mann over corruption charge arrested

Vijay Singla, Vijay Singla sacked, Punjab minister, Health Minister arrested, Punjab Health Minister sacked, Bhagwant Mann Vijay Singla sacked, bhagwant mann sack minister, bhagwant mann, Punjab CM, corruption charges, punjab, ACB, Crime

Punjab Chief Minister Bhagwant Mann on Tuesday said he removed Health Minister Vijay Singla from the state cabinet on charges of corruption. Soon after his removal, Singla was arrested by the Anti-Corruption Bureau.

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. అవినీతితో మంత్రి బర్తరప్.. అరెస్టు

Posted: 05/24/2022 04:59 PM IST
Punjab minister sacked by bhagwant mann over corruption charge arrested

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా తావులేదని ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీఇచ్చిన సీఎం.. అదే విధంగా అములు కూడా చేసిచూపించారు. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడిని ప‌ద‌వి నుంచి తొల‌గించారు. వైద్య శాఖ మంత్రి విజ‌య్ షింగ్లా అవినీతిపై క‌చ్చిత‌మైన సాక్ష్యాధారాలు ల‌భించ‌డంతో ఆయ‌న‌ను పద‌వి నుంచి త‌ప్పించినట్లు సీఎంఓ తెలిపింది. ఆప్ నిజాయితీ క‌లిగిన పార్టీ అని సీఎం మ‌న్ వ్యాఖ్యానించారు.

`కాంట్రాక్టుల్లో, , శాఖాప‌రమైన కొనుగోళ్ల‌లో అధికారుల నుంచి 1% క‌మిష‌న్ డిమాండ్ చేశారు. ఆయ‌న అవినీతిపై క‌చ్చిత‌మైన సాక్ష్యాధారాలు ల‌భ్య‌మ‌య్యాయి` అని షింగ్లాను ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డానికి కార‌ణాల‌ను సీఎంఓ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎంత చిన్నగా ఉన్నా దానిని తమ పార్టీ, ప్రభుత్వం సహించబోమని అందరికీ ఈ చర్యతో హెచ్చరికలు జారీ చేసింది మన్ ప్రభుత్వం. ప‌ద‌వి నుంచి తొల‌గించిన కాసేప‌టికి విజ‌య్ షింగ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. షింగ్లాను వైద్య శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మ‌న్ ఒక వీడియో సందేశం విడుద‌ల చేశారు.

`ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ క‌లిగిన పార్టీ. ఒక్క రూపాయి అవినీతిని కూడా ప్ర‌భుత్వం స‌హించ‌దు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు మాపై విశ్వాసం ఉంచారు. తాను రాష్ట్రంలో ప‌ర్య‌ట‌నలు చేస్తున్న‌ స‌మ‌యంలో.. అవినీతి కూపం నుంచి బ‌య‌ట‌వేసే వ్య‌క్తి కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న‌ట్లు మాకు అర్థ‌మైంది. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని నిర్ణ‌యించే స‌మ‌యంలో పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ అవినీతి వ్య‌తిరేక ల‌క్ష్యాన్ని నాకు స్ప‌ష్టంగా చెప్పారు. అవినీతిని స‌హించ‌బోనని నేను ఆయ‌న‌కు ప్రామిస్ చేశాను. వైద్య శాఖ మంత్రి అవినీతి విష‌యం ఇటీవ‌లే నా నోటీస్‌కు వ‌చ్చింది. ఈ విష‌యం మీడియాకు కూడా తెలియ‌దు.

నేను ఈ అవినీతిని దాచేయ‌వ‌చ్చు. కానీ, నేను అలా చేస్తే మ‌మ్మ‌ల్ని న‌మ్మిన ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన‌ట్లు అవుతుంది. అందుకే ఆ మంత్రిని ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాను` అని ఆ వీడియోలో సీఎం భ‌గ‌వంత్ మ‌న్ వివ‌రించారు. అవినీతికి పాల్ప‌డిన‌ట్లు విజ‌య్‌షింగ్లా కూడా ఒప్పుకున్నార‌ని మ‌న్ వెల్ల‌డించారు. గ‌తంలో కూడా ఆప్ ఇలా ఒక మంత్రిని అవినీతి ఆరోప‌ణ‌ల‌పై పద‌వి నుంచి తొల‌గించిన విష‌యాన్ని మ‌న్ గుర్తు చేశారు. 2015లో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పౌర స‌ర‌ఫ‌రాల మంత్రిని ఇలాగే అవినీతి ఆరోప‌ణ‌ల‌పై తొల‌గించార‌ని తెలిపారు. విజ‌య్ షింగ్లాను వైద్య శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన కొద్ది గంట‌ల‌కు పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles