Truck carrying liquor overturns.. bottles go missing మందుబాబులకు లక్కీచాన్స్.. దొరికినోడికి దొరికినంత మద్యం..

Nagar kurnool passers by picked up liqour bottles as a truck overturns

liquor truck overturn, beer bottles, liquor bottles, district headquarters, Road, Passengers, motorists, bottles of liquor, Nagar Kurnool, Telangana, Crime

A liquor truck overturned near Nagar Kurnool district headquarters on Monday evening. With this, beer and liquor bottles went on the road. Passengers and motorists picked up bottles of liquor which were found on the Road.

మందుబాబులకు లక్కీచాన్స్.. దొరికినోడికి దొరికినంత మద్యం..

Posted: 05/24/2022 03:57 PM IST
Nagar kurnool passers by picked up liqour bottles as a truck overturns

నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా అంటే.. ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో.. అక్కడి మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ మందుబాబుల వంతు వచ్చింది. జిల్లాలోని మంతటి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో మంతటి ప్రజలు సంబరంలో మునిగితేలారు. దొరికిన వారికి దొరికినంత మద్యాన్ని తీసుకెళ్లారు.

ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకోగా.. బొలేరో వాహన డ్రైవర్ ను పట్టించుకున్నవారు లేరు కానీ.. మద్యం బాటిళ్లను మాత్రం అక్కడివారు ఎత్తుకెళ్లారు. మద్యం బాటిళ్లను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో బీరు, లిక్కర్ బాటిళ్లు ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహ‌నంలో లిక్కర్ కాటన్ల‌ను తీసెకెళ్తున్నారు. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ. 5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుంది.

అయితే నాగర్ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా సమీపానికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. దీంతో బీరు బాటిల్, లిక్కర్ బాటిళ్లు పగిలి మద్యం రోడ్డు పాలైంది. చాలా వరకు మద్యం బాటిళ్లను వాహనదారులు, ప్రయాణికులు లూటీ చేశారు. దాదాపు రూ. మూడున్నర లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహ‌నంలో లిక్కర్ కాటన్ల‌ను తీసెకెళ్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles