Battery defects, insufficient testing caused EV fires: DRDO report ఎలక్ట్రిక్ బైకుల పేలుడు ఘటనలపై డీఆర్డీఓ షాకింగ్ విషయాలు..

Ev fires ola electric okinawa others summoned by govt based on drdo report

DRDO, Electrical Vehicles, Okinawa, EV fires, Ola, Pure EV, Boom Motor, Jitendra Electric Vehicles, EV fires, EV fires investigation, EV fires DRDO report, EV fires DRDO submits report, EV fire Ola Electric, EV fire Okinawa, defected batteries, two-wheeler ev companies, lower-grade materials, insufficient testing, Electric car battery, Okinawa Autotech, Current Affairs, Crime

The electric scooter fires that made news in recent weeks were caused by defects in their batteries, including in the designs of the battery packs and modules, says a report by the Defence Research & Development Organisation. A person who has seen the report told Business Standard the defects may have crept in because electric two-wheeler companies intentionally used lower-grade materials to cut costs.

ఎలక్ట్రిక్ బైకుల పేలుడు ఘటనలపై డీఆర్డీఓ షాకింగ్ విషయాలు.. ఈవీ కంపెనీలపై చర్యలు

Posted: 05/23/2022 03:46 PM IST
Ev fires ola electric okinawa others summoned by govt based on drdo report

ఇంధన రేట్లు అకాశాన్నంటుతున్న క్రమంలో దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ కొనసాగించాలంటూ కేంద్రం ఇంధన సంస్థలతో పాటు ఇటు ద్విచక్ర వాహనా సంస్థలను కూడా కోరింది. దీంతో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఫోర్ వీలర్ వాహనాలను కూడా పలు కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటితో రోజువారి ఖర్చులు కూడా గణనీయంగా తగ్గడంతో వాటిని కోనేందుకు ప్రజలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈవీ కార్ల విషయంలో అన్ని అంశాలను చక్కగా పరిశీలించిన సంస్థలు.. అదే ద్విచక్రవాహనాల విషయంలో మాత్రం మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ తెరపైకివచ్చాయి.

ఈవీ టూవీర్ల విషయంలో పలు సంస్థలు తయారు చేసిన వాహనాలు వరుసగా ప్రమాదాలను ఎదుర్కోంటున్నాయి. ఈ వరుసప్రమాదాల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక ఇదేసమయంలో ఎలక్ట్రికల్ వాహానాల సంస్థలకు హచ్చరికలు జారీచేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.. ఇలా అయితే లైస్సెన్సులు రద్దచేస్తామని కూడా పేర్కోన్నారు. అదే సమయంలో ఎలక్ట్రికల్ వాహనాల వరస పేలుళ్లలపై కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కూడా సీరియస్ అయ్యారు. ఈవీ వాహనాలు పేలుళ్ల వెనుక అసలేం జరుగుతుందో తెలుసుకుని తమకు నివేదిక సమర్పించాలని ఆయన డీఆర్బీవో అధికారులకు అదేశించారు.

అయితే డీఆర్బీవో సమర్పించిన నివేదికలో అత్యంత సంచలనాత్మక విషయాలు పర్కొన్నారని సమాచారం. ఈ ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ప్రతీ వారం ఏదో ఒక చోట ఎలక్ట్రిక్ వాహనాలు మంటలకు దగ్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో వాటిని ఎంతో ఆసక్తిగా కొన్నవారు.. ఇప్పుడు వాటిని కోనేందుకే జంకుతున్నారు. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా హరిస్తున్న ఈ ఎలక్ట్రికల్ వాహనాలపై ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రమాదాలపై డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి.

అయితే డీఆర్‌డీవో నివేదిక బయటకు రావడంతో సర్వత్రా అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డీఆర్డీఓ వెల్లడించిన అంశాలు ఏంటన్న వివరాల్లోకి వెళ్తే.. ఈవీ టూవీలర్ వాహనాల వరస పేలుళ్లకు ముందుగా భావించినట్లు ఎండాకాలం, ఎండలు అసలు కారణమే కాదని తేలింది. అయితే ఈ వాహనాల పేలుడుకు తయారీలో లోపభూయిష్టతే కారణమని తెలిపింది. వాహనాల్లో వినియోగించిన బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ డీఆర్డీఓ నివేదిక రూపొందించింది. కొన్ని సంస్థలు తక్కువ ధరకు లభిస్తుండటంతో నాసిరకం బ్యాటరీలను సైతం రూపోందించాయిని నివేదిక పేర్కొంది.

బ్యాటరీ ప్యాక్స్‌ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో లో-గ్రేడ్‌ ముడిసరుకును కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే వినియోగించడం కూడా ప్రమాదాలకు కారణమైందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles