అన్ని రాష్ట్రాల మాదిరిగా కర్ణాటక అప్పుడప్పుడు కాకుండా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఆ మధ్య ఆంజనేయుడు పుట్టిన పుణ్యభూమి విషయమై వివాదం రేగగా, ఉత్తర భారతానికి చెందిన కోందరు నేతలు ఆయన దళితుడని చౌకబారు వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక అంశంలో కర్ణాటక వార్తల్లో నిలుస్తోంది. ఆ తరువాద ముఖ్యమంత్రి మార్పు, ఆ వెంటనే ఆయన వైరాగ్య వ్యాఖ్యలు, హిజబ్ వివాదం, మసీదులపై మైకులు తీసివేయాలని, ఆ తరువాత ముఖ్యమంత్రి పదవికి కోసం రూ.2500 కోట్లు అడుగుతున్న బీజేపి అంటూ.. ఇలా అనేక వివాదాస్పద అంశాలతో ఆ రాష్ట్రం వార్తల్లో నిలుస్తోంది.
ఇక తాజాగా విద్యార్థులు నడిరోడ్డుపై కోట్టుకోవడం వైరల్ గా మారింది. అయితే విద్యార్థులు అంటే మగపిల్లలు కాదు.. ఏకంగా ఆడపిల్లలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అలా ఇలా కాదు.. భిగ్గరగా అరుస్తూ.. జుట్టుపట్టుకుని లాగి పడేస్తూ.. కిందకు నెట్టేస్తూ.. రక్కేస్తూ.. చివరకు కర్రలను చేతబట్టి కూడా కొట్టేసుకున్నారు. ఓ పాఠశాలకు చెందిన విధ్యార్థినులు ఇలా కోట్టుకోవడం చూసిన స్థానికులు వెంటనే తమ సెల్ ఫోన్లకు పనిచెప్పారు. అవికాస్తా నెట్టింట్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. అయితే విద్యార్థినిలు కొట్టుకోవడానికి గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. కాగా, ఓ విషయంపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. కొద్ది సేపటికే ఈ చర్చ గొడవకు దారి తీసిందని సమాచారం.
దీంతో ఓ వర్గానికి చెందిన బాలికల గుంపు మరొక వర్గంవారిపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పట్టుకొని లాక్కున్నారు. గట్టిగా కేకలు వేస్తూ, కర్రలతో దాడిచేస్తూ, తన్నుకున్నారు. ఈ ఘర్షణను చూసిన ఇతర పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు కల్పించుకుని వారిని అడ్డుకుని శాంతింపజేశారు. గొడవ పడుతున్న బాలికలందరూ స్కూల్ యూనిఫాం ధరించి ఉన్నారు. వీరంతా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా తేలిసింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియరాలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తన ఫోన్‌లలో రికార్డ్ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది.
Y'all need to even if y'all haven't already pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
(And get your daily news straight to your inbox)
Jul 05 | నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే... Read more
Jul 05 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై... Read more
Jul 05 | స్థానబలం అంటే తెలుసుగా.. ఫలానా స్థానంలో ఫలానావారికి బలం అధికంగా ఉంటుందని అర్థం. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ఈ పదం చాలా వింటూవుంటాం. ఫలానా మైదనాంలో ఫలానా జట్టుకు బాగా కలసివస్తోంది. వారి... Read more
Jul 05 | భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే... Read more
Jul 05 | హిజ్రాలను చూస్తేనే కొందరు ఈసడించుకోగా, మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. ఇక వారు ఎదురుగా వచ్చి డబ్బులు అడిగితే.. లేవని సమాధానం చెప్పి పంపేవారి సంఖ్యే ఎక్కువ. కానీ వారిని కూడా సాధారణ మనుషులు... Read more