drunk and drive: Traffic duties with fines, revocation of DL తాగి వాహనం నడిపితే.. నడిరోడ్డుపైనే ట్రాఫిక్ డ్యూటీలు..

Planning to drink a few pegs and drive in hyd be prepared to perform traffic duties

cyberabad traffic police, driver’s licence, drunken drivers, traffic duties, court, drunken drivers, collecting fines, revocation of driver’s licence, punishment, hyderabad, Crime

Imagine managing a crazy flow of traffic in the city standing under the hot sun. Sounds like a nightmare? The next time you plan on having a few pegs and driving your vehicle, be prepared to get a taste of it. Cyberabad Traffic Police tweeted saying that the court has issued an order to make drunken drivers perform traffic duties along with collecting fines and revocation of driver’s licence.

మందుబాబులూ జాగ్రత్తా.! తాగి వాహనం నడిపితే.. నడిరోడ్డుపైనే ట్రాఫిక్ డ్యూటీలు..

Posted: 05/18/2022 06:24 PM IST
Planning to drink a few pegs and drive in hyd be prepared to perform traffic duties

అసలే అంతర్జాతీయ నగరంగా పురగమిస్తున్న హైదరాబాద్.. రోడ్డుపై కదలాలంటే ట్రాఫిక్ సమస్య ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా కాసింత ట్రాఫిక్ తగ్గినా.. కాలుష్యం మాత్రం అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే కొన్ని వాహనాల గొట్టాల నుంచి పోగ అధికస్థాయిలో విడుదల అవుతోంది. ఓ వైపు తల పగిలే ఎండలో.. ఊపిరి పీల్చుకోలేని దారుణ కాలుష్యాన్ని వదిలే వాహనాల మధ్య నడిరోడ్డుపై ట్రాఫిక్ డ్యూటీలు చేయాలంటే.. ఈజీ పనికాదు. ఒక్కసారి ఊహించుకోండి. పీడకలలా అనిపిస్తుందా? ఇలాంటివి నిజం కావొద్దు అనుకుంటే మీరు తాగి వాహనం నడుపొద్దు. అలా చేస్తే.. కచ్చితంగా.. కొన్నిసార్లు మీరు ఎండలో ట్రాఫిక్ ను నియంత్రించే డ్యూటీ చేయాల్సి వస్తుంది.

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. తాగినవారు.. రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లలో శిక్షగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తారు. వీరితోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా ఉంటారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. ఎలాంటి ప్రమాదాలు ఉంటాయోనని తెలియజేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని పోలీసులు అంటున్నారు. అంతకుముందు రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లలో అవగాహన కల్పించే ప్లకార్డులను చూపించడం వంటి వాటిని చేసేవారు. ఇకపై నేరుగా ట్రాఫిక్ విధులను నిర్వర్తించాలి.

అయితే గతంలో డ్రంగ్ అండ్ డ్రైవ్ లో చాలా కేసులు కోర్టుకు పంపించడంతో చాలా మంది కేసులు చుట్టు తిరిగేవారు. ఏళ్ల తరబడి కేసుల్లో ఇరుక్కుని పరిష్కారం లభించని కేసులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రయత్నాలు చేశాయి. కేసులను జరిమానాలతో సరిపెట్టే ప్లాన్ వేశారు. కిందటి మార్చిలో లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించారు. అయితే ఇందులో భాగంగా.. జరిమానా తగ్గింపును ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 12వ తారీకు వరకు విధించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వాహనదారులు క్యూలైన్లలో నిలబడి మరి జరిమానా చెల్లించి వాహనాలను విడిపించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles