AP govt revokes suspension of ex-intelligence chief ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్..

Andhra govt lifts ab venkateswara raos suspension directs him to report to gad

AP intelligence bureau chief, A B Venkateshwara Rao, Suspension, High Court, Supreme Court, AP CS Sameer Sharma, G.O, Government Order, Suspension, Andhra Pradesh government, AP government Chief Secretary, GAD, Andhra Pradesh, Politics, Crime

The Andhra Pradesh government has revoked suspension of senior IPS officer and former state intelligence chief AB Venkateswara Rao and has reinstated him in service after more than two years, following a direction from the Supreme Court last month. CS Sameer Sharma issued a G.O to this effect, which said Rao would be reinstated in service with retrospective effect from February 8, 2022.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్..

Posted: 05/18/2022 12:28 PM IST
Andhra govt lifts ab venkateswara raos suspension directs him to report to gad

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్టుమెంటులో రిపోర్ట్ చేయాలవి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంటు అర్డర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన అదేశాల కాఫీ ఇవాళ సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుకు అందాయి.

కాగా, గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై వైసీపీ ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తనకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించానని పేర్కోంటూ ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేశారు. తన సస్పెన్షన్‌పై హైకోర్టు, సుప్రీం కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ మధ్యే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గతంలోనే ఏపీ హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు కూడా ఆ ఆదేశాలే ఇచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీతో ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల సస్పెన్షన్‌ ముగిసినట్టేనని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆయనకు ఇవ్వాల్సిన జీతభత్యాలను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన కోర్టు.. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇక, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈ మధ్యే రెండు మూడు సార్లు సచివాలయానికి వచ్చారు ఏబీ వెంకటేశ్వరరావు. యూనిఫాం ధరించి మరి సచివాలయంలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏపీ సర్కార్‌ కూడా సస్పెన్షన్‌ ఎత్తివేడం.. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించడంతో.. ఆయన సేవలను ప్రభుత్వం ఎలా వినియోగించు కోనుందో అనే అంశమై సర్వత్రా ఆసక్తి నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles