Indian American student choked for few minutes by classmate భారతీయ విద్యార్థిపై అమెరికా విద్యార్థి దౌర్జన్యం..

Video sparks outrage after indian american student choked bullied by classmate

Indian-American student bullied by white, Indian student bullied by white, Indian student assaulted by a white student, Indian student assaulted in school canteen, Indian student bullied in United States, Indian student assaulted in United States, shaan pritmani, texas school, punishment, bullying, Coppell Middle School, Dallas, Texas, America, Crime

A video of an American Indian boy being tormented and assaulted by a white student at a school in Texas has sparked outrage on social media. The video depicts an Indian American boy being tormented by a white student who chokes and takes him away from the bench where he was seated.

అగ్రరాజ్య స్కూల్లో ఇండియన్ విద్యార్థిపై దౌర్జన్యం.. తమ విద్యార్థికే యాజమాన్యం వత్తాసు..

Posted: 05/18/2022 11:32 AM IST
Video sparks outrage after indian american student choked bullied by classmate

విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పి..వారిని సన్మార్గంలో నడిచేలా చేస్తూ.. తప్పుఒప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఉన్న పాఠశాల యాజామాన్యం.. తప్పును తప్పని చెప్పలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, తమ గూటికి చెందిన పక్షిని రక్షంచడంలో పాఠశాల యాజమాన్యం మొగ్గుచూపింది. కళ్లకు కనబడుతున్న సాక్షాలను చూసినా.. అమెరికా విద్యార్ధికి స్వల్పమైన శిక్షను విధించి.. భారత విద్యార్థికి మాత్రం అంతకు మూడు రెట్లు శిక్షను విధించింది. తనపై వేధింపులకు పాల్పడిన విద్యార్థి ఎంతగా వేధించినా.. సహనంతో సంయమనం పాటించిన ఇండియన్ అమెరికన్ విద్యార్థికి మూడింతల శిక్షను అధికంగా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీటులోంచి లేవమంటే లేవలేదన్న కోపంతో అమెరికా విద్యార్థి..  భారతీయ విద్యార్థిపై దాడి చేశాడు. అతడి గొంతును చేత్తో బిగించి.. సీటులోంచి లాగి కింద పడేశాడు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డా.. ఆ శ్వేతజాతీయుడు లక్ష్యపెట్టలేదు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనితోడు.. స్యూల్ యాజమాన్యం దాడి చేసిన విద్యార్థికి ఒక్క రోజే పనిష్మెంట్ ఇచ్చి బాధిత విద్యార్థి షాన్ ప్రీత్మానీకి మూడు రోజుల పాటు పనిష్మెంట్ ఇవ్వడం.. అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెక్సాస్ రాష్ట్రంలోని కోపెల్ ప్రాంతంలోని కోపాల్ మిడిల్ స్కూల్‌లో నార్త్‌లో ఇటీవల ఈ దారుణం జరిగింది. వైరల్ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. సీటును ఖాళీ చేయాలంటూ ఓ విద్యార్థి షాన్‌పై ఒత్తిడి తెచ్చాడు. కానీ.. షాన్ ఇందుకు నిరాకరించాడు. ఆ సీటులో ఎవరూ లేని సమయంలోనే తాను వచ్చి కూర్చున్నానని, ఇప్పుడు మరో సీటులోకి వెళ్లడం కూదరదని శాంతంగానే జవాబిచ్చాడు. అయితే.. మరో సీటులోకి వెళ్లాలంటూ రెండు సార్లు గద్దించిన విద్యార్థి.. చివరకు షాన్ గొంతు చుట్టూ చేయి వేసి బిగించాడు. ఆ తరువాత.. అతడి మెడపై మోచేతితో పొడిచాడు. చివరకు అతడిని కిందకు లాగేశాడు.

ఇదంతా సాటి విద్యార్థులు ఫోన్‌లో రికార్డు చేయడంతో ఇది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. దాడి చేసిన విద్యార్థి తండ్రి స్కూల్ ట్రస్టీల బోర్డులో సభ్యుడు కావడంతోనే విషయాన్ని దాచి పెట్టేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే వాదన కూడా బయలు దేరింది. ఈ విషయంలో విద్యార్థి తండ్రికి పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. కాగా..  ఈ దాడికి సంబంధించిన వీడియో చూసి తన గుండె తరుక్కుపోయిందని షాన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నాకు దుఃఖం ఆగలేదు. రాత్రంతా నిద్రరాలేదు. ఆ సందర్భంలో నా కుమారుడి మెడ విరిగిపోయి ఉండేది. వాడు నాకు దూరమై ఉండేవాడు. స్కూల్ వాళ్లేమో ఇదంతా విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవగా పేర్కొన్నారు.’’ అంటూ షాన్ తల్లి సోనికా కుక్రేజా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. షాన్‌పై దాడి వీడియో వైరల్ అవడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రకటించింది. అయితే.. షాన్ వేధింపులకు గురయ్యాడన్న విషయాన్ని ప్రకటనలో పేర్కోనని స్కూల్ యాజమాన్యం.. విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవగా ఘటనను అభివర్ణించింది. తమకు న్యాయం చేయాలంటూ షాన్ తల్లి ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటివరకూ 1.5 లక్షల మంది సంతకాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles