Over 350 Kashmiri Pandit PM package employees resign కాశ్మీర్ పండిట్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు

Over 350 kashmiri pandit pm package employees resign after rahul bhat gunned down in office

J&K, Kashmiri Pandits, Kashmir Pandits killing, Kashmir, terrorism, Manoj Sinha, Prime Minister Package Employees, Rahul Bhat, kashmir pandits mass resignation, Lashkar-e-Taiba terrorists, Budgam district, central Kashmir, jammu and kashmir, jammu news, crime

Mass resignation by more than 350 Kashmiri Pandit Prime Minister Package Employees in Kashmir has been sent to Lt. Governor Manoj Sinha. Two Lashkar-e-Taiba terrorists had entered a crowded government office and shot dead a Kashmiri Pandit employee in Budgam district in central Kashmir on Thursday, in a targeted killing that drew strong condemnation from political parties and employees' association.

జమ్మూకాశ్మీర్: ఉద్యోగాలకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన కాశ్మీర్ పండిట్లు

Posted: 05/14/2022 12:39 PM IST
Over 350 kashmiri pandit pm package employees resign after rahul bhat gunned down in office

జమ్ముకశ్మీర్ లో కశ్మీరీ పండిట్లపై జరుగుతున్న దారుణాలు మరో మలుపు తిరిగాయి. ఇన్నాళ్లు ఉగ్రవాదులు ఏం కావాలని అనుకున్నారో అదే జరుగుతోంది. తాజాగా బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాయి. కాగా.. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్​లోని పండింట్​లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ లో భద్రత లేని కారణంగా ఆ రాష్ట్రం వదిలి అనేక మంది పండిట్లు ఇప్పటికే వలసలు పోయారు. అయితే కొందరు పండిట్లు మాత్రం తమ ఉద్యోగాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు.

ఓ నివేదిక ప్రకారం.. 350కిపైగా మంది కశ్మీరీ పండిట్​లు.. జమ్ముకశ్మీర్​ ఎల్​జీ, కేంద్ర హోంశాఖకు తమ రాజీనామాలను అందించారు. 12ఏళ్లుగా తమకు ఈ ప్రాంతంలో రక్షణ లేదని, తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ అని లేఖలో పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్​ల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని, అందుకు నిరసనగానే రాజీనామాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తమకు సంపూర్ణ రక్షణ కల్పిస్తేనే తాము ఉద్యోగాలు చేయగలమని వారు కేంద్రానికి తేల్చిచెప్పారు. కాగా.. పోలీసులు ఈ నివేదికను కొట్టిపారేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles