లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలపై తీవ్ర చర్చ మొదలైంది. ఆధ్యాతికం కన్నా శృంగార గురువుగా కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో పాపులారిటీ పోందిన నిత్యానంద.. దేశం వదిలి పారిపోవడానికి కూడా అదే కారణమైంది. దీంతో ఆయన గురించి వార్తలు కూడా వినబడటం లేదు. కాగా తాజాగా ఆయన మరణించారన్న వార్తలు విసృత్తంగా వినబడటంతో ఆయన భక్తులలో కలవరం మొదలైంది. అయితే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతున్న వార్తలపై స్వయంగా నిత్యానంద స్వామి స్పందించారు.
తాను చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నారని స్ఫష్టం చేశారు. 27 మంది డాక్టర్లు తనకు చికిత్స అందిస్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు. ‘‘నేను బతికే ఉన్నాను.. ప్రస్తుతం సమాధిలో ఉన్నాను. ప్రస్తుతానికైతే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేక పోతున్నాను’’ అంటూ ఆయన తన పేస్ బుక్ పోస్టు పెట్టారు. అనారోగ్యంతో నిత్యానంద చనిపోయాడంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బతికే ఉన్నట్టు స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు.
2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు. ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. కైలాస డాలర్‌ను ఆయన తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఆయన ప్రారంభించారు. ఆయన ప్రతీ ప్రకటన అప్పట్లో ఓ సంచలనమైంది.
లైంగికవేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను తప్పించుకుని ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లినట్టు వార్తలు ఉన్నాయి. అయితే ఈ పోస్టు ఎక్కడి నుంచి పెట్టారన్నదానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని ప్రకటనలు చేసినా నిత్యానంద ఎక్కడ ఉన్నారన్న విషయం స్పష్టంగా ఎవరికీ తెలియదు. ఆయన ఈక్వెడార్‌లో ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నా.. ఆ వార్తలను ఆ దేశం ఖండిస్తోంది. కాగా, నిత్యానందపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన భారత్‌లో 50సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా దేశం నుంచి అదృశ్యమై.. కైలస దివిలో ప్రత్యక్షమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more