తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనంగా మారారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అది కేవలం ప్రచారానికేనా లేక నిజంగా సీట్లు గెలిచే సత్తా ఉందా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే.. సిరిసిల్ల పర్యటనకు వెళ్తుండగా తన కాన్వాయ్ ను అడ్డుకుని.. టీఆర్ఎస్ కార్యకర్తతో దాడి చేయించిన ఘటనపై ఆయన తెలంగాణ డీజీపీకి గట్టి షాకే ఇచ్చారు. డీజీపీని కలసి తన పిర్యాదును అందజేద్దామన్నుకున్న పాల్ కు మహేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో ఆయనలో ఏదో ఉంది అని రాజకీయ పక్షాలకు అర్థమైంది.
గడిచిన కొద్ద నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన ఆయన.. అధికార టీఆర్ఎస్ అవినీతి మయం అయిందని, సీఎం కేసీఆర్ కుటుంబం 8లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడిందని పాల్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గవర్నర్ తమిళిసైని తరచూ కలుస్తోన్న కేఏ పాల్ పై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. తనపై కేసీఆర్ కుటుంబం దాడి చేయించిందేనంటూ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసిన పాల్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆశ్రయించడం చర్చకు దారి తీసింది.
ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్- ఆయన తనయుడు, రాష్ట్రమంత్రి మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఖండించారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలపై దర్యాప్తు జరిగితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దాడి విషయంలో తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని పాల్ తెలిపారు. ప్రధాని మోదీ మొదలుకొని, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలని కే ఏ పాల్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more