Train runs 2 kms back to rescue man who fell from running train జారిపడ్డ ప్రయాణికుడి కోసం వెనక్కు వచ్చిన రైలు

Railway officials timely action train runs 2 kms back to rescue man who fell on tracks

young man, Deepak, Vindhyachal village, Mirzapur district, Uttar Pradesh, Train Accident, Surat, Gujarat, moving train, accidentally fell, serious injuries, hospital, Tapti Ganga Express, Railway officials, Harda railway station, Harda District Hospital, Madhya Pradesh, crime

An accident took place in Madhya Pradesh. A young man accidentally fell from a fast moving train. Train officials were immediately alerted to the matter. But already the train is 2 km. Went ahead. However without thinking of the resurrection … went back the same route. The victim, who was lying on the rails with serious injuries, was rushed to the hospital in a timely manner. The accident took place on the Tapti Ganga Express

జారిపడిన ప్రయాణికుడు.. 2 కీమీ వెనక్కు వచ్చి అసుపత్రికి తరలించిన రైలు..

Posted: 05/13/2022 04:34 PM IST
Railway officials timely action train runs 2 kms back to rescue man who fell on tracks

రైల్వే స్టేషన్ల వద్ద కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం చేస్తూ పలువురు ప్రయాణికులు రైలు అందుకోవాలన్న అత్రృతలో ప్రమాదాల బారిన పడటం మనకు తెలిసిందే. అయితే పట్టాలు దాటుతుండగా కొందరు... కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు కూడా ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే రైల్వే స్టేషన్ల వద్ద ప్రమాదాలు జరిగిన సమయాల్లో రైల్వేఅధికారులు దానిని నిలిపివేయడం సాధారణం. కానీ కదులుతూ వెళ్తున్న రైలులోంచి ప్రయాణికులు కిందపడితే.. వారిని కోసం రైలు అగటం ఇప్పటివరకు వినలేదు. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రయాణికుడి కోసం రైలు ఆగడం కాదు.. ఏకంగా రెండు రిలోమీటర్ల దూరం వెనక్కువచ్చి మరీ అసుపత్రికి తరలించింది.

మద్యప్రదేశ్ లో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. ప్రయాణికుడికి తక్షణ సాయం అందించాలన్న ఉద్దేశ్యంతో అదే రైలును వెనక్కు వెళ్లి ఆపన్నహస్తం అందించాలని సూచించారు. ఇక ఆ మార్గంలో వేరే రైళ్లు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే రైలు 2 కి.మీ. ముందుకు వెళ్లిన రైలు.. అదే మార్గంతో వెనక్కి వెళ్లింది. తీవ్రగాయాలతో పట్టాలపై పడిఉన్న బాధితుడిని రైలులో ఎక్కించుకుని వచ్చి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తపతి గంగా ఎక్స్‌ప్రెస్‌ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీర్జాపూర్‌ జిల్లా వింధ్యాచల్ గ్రామానికి చెందిన 19ఏళ్ల దీపక్ .. తన మామతో కలసి పనినిమిత్తం గుజరాత్‌లోని సూరత్‌‌కు వెళ్తున్నాడు. ఇందుకోసం వారు తపతి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కొద్ది దూరం వెళ్లాక.. తన సీటులో నుంచి లేచిన దీపక్.. ప్రయాణికులు ఎక్కే ద్వారం వద్ద కూర్చున్నాడు. ఆ తర్వత మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని చర్ఖేడా స్టేషన్ సమీపంలో నిద్రలోకి జారుకున్న దీపక్ హఠాత్తుగా రైలు నుంచి ట్రాక్‌పై పడిపోయాడు. రైలు నుంచి ఓ ప్రయాణికుడు కిందపడిపోయాడని తెలిసి.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదవశాత్తు ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు సకాలంలో స్పందించారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు... మళ్లీ అదే రైలును వెనక్కి పంపించారు. దీపక్ కింద పడిపోయాక.. రైలు దాదాపు రెండు కి.మీ. ముందుకెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకెళ్లి.. తీవ్ర గాయాలతో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న దీపక్‌ని ట్రైన్‌లో ఎక్కించారు. ఆ తర్వాత హర్దా రైల్వే స్టేషన్‌లో దింపారు. అక్కడి నుంచి హర్దా జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు షిప్ట్ చేశారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles