Dr P Narayana arrested in Question paper leak scam ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

Narayana group founder dr p narayana arrested in connection with andhra ssc scam

P Narayana, Narayana Group, Narayana Group founder arrested, P Narayana arrested, Andhra SSC Scam, Tirupati, Andhra Pradesh, Politics, Crime

Founder of the Narayana Group of educational institutions and former Telugu Desam Party Minister Dr P Narayana was arrested by the Andhra Pradesh Police Tuesday in connection with the alleged leak of question papers from the ongoing SSC exam for Class X students. The police is investigating a teacher who works at one of his institutions.

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ చేసిన ఏపీసీఐడీ పోలీసులు

Posted: 05/10/2022 01:35 PM IST
Narayana group founder dr p narayana arrested in connection with andhra ssc scam

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్‌ అయ్యారు. హైదరాబాద్ లోని కొండాపూర్‌లో గల ఆయన నివాసానికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. నారాయణకు చెందిన సోంత వాహనంలోనే ఆయనను ఏపీలోని తమ కార్యాలయానికి సీఐడి పోలీసులు తరలిస్తున్నారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.

స్థానిక హైదరాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నారాయణ ఇంటికి చేరుకున్న ఏపీ సిఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. దంతో ఆయన ఇంటికి నేరుగా చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, నారాయణ విద్యాసంస్థలకు చెందిన తిరుప‌తిలోని పాఠశాల నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే.

తిరుపతిలోని నారాయ‌ణ పాఠశాల ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు ప్ర‌శ్నాప‌త్రం లీకైన‌ట్లు పోలీసులు గుర్తించారు. ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత ఉద‌యం 9:57 గంట‌ల‌కు వాట్సాప్‌లో తెలుగు పేప‌ర్ వైర‌ల్ అయింది. నారాయ‌ణ విద్యాసంస్థ‌లో ప‌ని చేస్తున్న గిరిధ‌ర్ వాట్సాప్ నుంచి తెలుగు ప్ర‌శ్నాప‌త్రం లీకైన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. నారాయణ అరెస్ట్ విషయాలను సీఎం జగన్ కు వివరించారు.

నారాయణ అరెస్టును ఖండించిన అచ్చన్నాయుడు

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు. జగన్ రెడ్డి అవినీతిని, విధ్వంస పాలనను ప్రశ్నించిన వారిపై వేలసంఖ్యలో అక్రమకేసులు నమోదుచేశారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని’’ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles