AIMIM president Owaisi condemns honour killing సరూర్ నగర్ పరువు హత్యపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందన

Hyderabad killing we don t stand with murderers says asaduddin owaisi

AIMIM, Asaduddin Owaisi, MIM Member of Parliament, constitution, Hyderabad Honour Killing, Islam, Owaisi, Saroornagar, Hyderabad, Telangana, Crime

Reacting to the killing of a 25-year-old man in Hyderabad by the family of his wife over interfaith marriage, All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi condemned the “dishonour killing” incident that took place in Saroornagar in Telangana. Asaduddin Owaisi termed it a “criminal act” as per the constitution and Islam.

సరూర్ నగర్ పరువు హత్యపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందన

Posted: 05/07/2022 05:33 PM IST
Hyderabad killing we don t stand with murderers says asaduddin owaisi

తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం మతాంతర వివాహాం నేపథ్యంలోనే జరిగింది. ఆశ్రిన్ సుల్తానా అనే యువతి.. తాను ఇష్టపడిన నాగరాజు అనే దళిత యువకుడని వివాహంచేసుకోడం సహించని అమె సోదరుడు నాగరాజును నడిరోడ్డుపైనే దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.

దళిత యువకుడు నాగరాజు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ,  సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు.

హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు ఆయన. ఖార్గోన్‌(మధ్యప్రదేశ్‌), జహంగీర్‌పురి(ఢిల్లీ) మత ఘర్షణలపైనా స్పందిస్తూ.. ఇకపై ఏ మతానికి సంబంధించి ఉరేగింపులు జరిగినా మసీదులపై హైరెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉరేగింపులు జరిగేటప్పుడు లైవ్‌ టెలికాస్టింగ్‌ చేయాలని, అప్పుడు రాళ్లు రువ్వే ఘటనలు జరిగినా.. లేక మరే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా వాటి వెనుక ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles