IRCTC to run Swadesh Darshan train ఉత్తర భారతవనిని చుట్టి వచ్చేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక ఫ్యాకేజీ రైళ్లు.!

Irctc to run swadesh darshan train mahalaya pind daan express

Indian Railway, IRCTC, Swadesh Darshan, Mata Vaishnodevi Temple, Agra, Mathura, Vaishnodevi, Amritsar, tourist trains, Tirupati/Renigunta via Vijayawada, Secundrabad, Mahalaya Pind Daan Express, Varanasi, Prayag Sangam, Gaya, attractive packages

Indian Railway Catering and Tourism Corporation (IRCTC) will run Swadesh Darshan tourist trains with attractive packages.The first package — North India Train Tour with Mata Vaishnodevi covering Agra, Mathura, Vaishnodevi and Amritsar. The tour will begin on May 7 from Tirupati/Renigunta via Vijayawada and Secundrabad.

ఉత్తర భారతవనిని చుట్టి వచ్చేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక ఫ్యాకేజీ రైళ్లు.!

Posted: 05/07/2022 04:40 PM IST
Irctc to run swadesh darshan train mahalaya pind daan express

ఉత్తర భారతదేశ యాత్ర ఔత్సాహికులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఉత్తర భారతంలోని పలు పర్యాటక కేంద్రాలతో పాటు, ఫుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్‌ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న తిరుపతి (రేణిగుంట జంక్షన్) నుంచి ఈ ప్రత్యేక రైలు బయల్దేరుతుందని అన్నారు.

రేణిగుంట నుంచి బయల్దేరే ఈ రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని మొత్తంగా ఉత్తర భారతంలో ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానం తిరిగి చేరకుంటుందని అన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర రూ.22,165గా ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్‌ 15న సికింద్రాబాద్‌ నుంచి మహాలయ పిండ్‌దాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్‌ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు.

విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్‌ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్‌ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా 8287932312, 9701360675 ఫోన్‌ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles