Food Delivery Boy arrested After stealing 24.5 Tula Gold స్విగ్గీ బాయ్ తో స్నేహం.. 25 తులాలా బంగారం మాయం..

Swiggy food delivery boy arrested after stealing 24 5 tula gold

Suresh Naik, Sunny, allwyn colony, Kamareddy dist, food delivery boy, Instagram, Minor Girl, infatuation, Kukatpally police, Srihari Nagar, 24.5 Tula gold, Moosapet, ACP Chandrasekhar, DI Anjaneyulu, CI Narsing Rao, Hyderabad, Telangana, Crime

Kukatpally police arrested a food delivery boy, who was alleged of stealing valuables worth Rs 15 lakh (approx) from a from the house after introducing himself on Instagram and speaking confidently with a minor girl. ACP Chandrasekhar, DI Anjaneyulu and CI Narsing revealed the details of the theft.

స్విగ్గీ బాయ్ తో స్నేహం.. 25 తులాలా బంగారం మాయం..

Posted: 05/05/2022 04:41 PM IST
Swiggy food delivery boy arrested after stealing 24 5 tula gold

సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులను ఎంత మాత్రం నమ్మరాదని ఇదివరకే పలు ఘటనలు చాటిచెప్పాయి. ప్రస్తుతం సమాజం అంతా షోషల్ మీడియా అంటూ ఫోన్ చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో మైనర్ బాలబాలికలకు సెల్ ఫోన్లు ఇవ్వరాదని కూడా పలు ఘటనలు నిరూపించాయి. అయితే మారం చేసే పిల్లల కోసం తల్లిదండ్రులు వారిని కాదనలేక తెరిచే సోషల్ మీడియా అకౌంట్లతో వారికి కొత్త కష్టాలు వచ్చిపడతున్నాయి. ఈ సామాజిక మాద్యమాల్లో పరిచయమైన వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా నిత్యం చేస్తూనే ఉండాలి.

అలా చేయని పక్షంలో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నిజమైన స్నేహితులుగా భావించి వారితో సన్నిహిత్యం పెంచుకుంటారు. ఆ తరువాత ఇలాంటి ఘటనలు కూడా జరగోచ్చు. హైదారబాద్ లోని ఓ మైనర్ బాలికతో ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. చాట్ చేస్తూ.. అదను చూసి ఆ బాలిక ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్నేహం పేరుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా చింతలగుట్ట తండాకు చెందిన బానోతు సురేశ్‌ నాయక్‌ అలియాస్‌ సన్ని ఆల్విన్‌కాలనీలో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మూసాపేట శ్రీహరినగర్‌లో నివాసం ఉండే ఓ బాలికను సురేశ్ నాయక్‌ జనవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుని చాట్‌ చేస్తున్నాడు. అయితే సన్నీని నిజమైన స్నేహితుడిగా భావించిన బాలిక.. తమ తల్లిదండ్రులు ఇంట్లో లేరని సమాచారం అందించడంతో.. గత నెల 20, 24 తేదీల్లో సన్నీ బాలిక ఇంటికి వెళ్లాడు. తొలి పర్యాయం ఇంటితో పాటు ఇంట్లోని వస్తువులపై రెక్కీ నిర్వహించాడు.

ఇక రెండో పర్యాయం గత నెల 24న మళ్లీ బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు అదను చూసి బంగారాన్ని తస్కరించాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం తాను బయటకు వెళ్తే అందరూ గుర్తుపడతారని చె్పి.. బాలికను బయటకు వెళ్లి కూల్ డ్రింక్ తీసుకురమ్మని చెప్పాడు. అంత అదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న యువకుడు.. బాలిక తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి అక్కడ బీరువాలో ఉన్న 24.5 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న బాధితులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మే 1న ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సన్నీ నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 24.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles