2016 EgyptAir Crash Caused By Pilot's Lit Cigarette 'ఈజిప్ట్ ఎయిర్' కుప్పకూలడం వెనుక అసలు సత్యమేమిటో తెలుసా.?

Pilot s lit cigarette sparked fire that caused 2016 egyptair crash and killed 66 report

egyptair, flight crash, cigarette, pilot, Airbus A320, Paris to Cairo, eastern Mediterranean Sea, island of Crete, EgyptAir Crash, EgyptAir 804, EgyptAir flight MS804, Airbus A320 aircraft

In 2016, an EgyptAir flight crashed and all 66 people onboard died. Now, a report by French aviation experts has claimed that the accident occurred after the pilot’s lit cigarette caused a cockpit fire. The 134-page report states that the pilot of the MS804 lit a cigarette in the cockpit, due to which oxygen leaking from an emergency mask combusted.

ఆరేళ్ల క్రితం 'ఈజిప్ట్ ఎయిర్' కుప్పకూలడం వెనుక అసలు సత్యమేమిటో తెలుసా.?

Posted: 04/28/2022 12:45 PM IST
Pilot s lit cigarette sparked fire that caused 2016 egyptair crash and killed 66 report

గగనతలంలో విమానం ఎగురుతోందంటే.. అందుకు పూర్తి బాధ్యత విమాన పైలెట్ దే. కాస్తో కూస్లో కో పైలెట్ సహకారం కూడా ఉంటుంది. విమానయానం చేసే ప్రయాణికుల అందరి ప్రాణాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఎంతో బాధ్యతాయుతంగా టేకాప్ చేయడంతో పాటు ల్యాండింగ్ చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చుతారు కాబట్టే వారి వేతనాలు కూడా లక్షల్లో ఉంటాయి. అయితే అడపాదడపా విమానాలు కుప్పకూలిపోతుంటాయి. అందులో సాంకేతిక కారణాలది కొంత కారణమైతే.. పైటెట్ల తప్పిదం కూడా కొంత మేర ఉంటుంది. ఔనా.. వినడానికే ఆశ్చర్యంగా వున్న ఇది ముమ్మాటికీ నిజమని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.

ఫైలెట్ నిర్లక్ష్యం కారణంగా విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బంది ప్రాణాలు గాల్లో కలసిపోయాయంటే నమ్మశక్యంగా లేదు, కానీ ఇది ముమ్మాటికీ నిజమని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆరేళ్ల క్రితం 66 మంది ప్రయాణికులతో వెళ్తూ సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు.

దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధకారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి.

ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 మే 2016లో పారిస్‌ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 66 మంది ప్రయాణికులు సహా 40 మంది ఈజిప్షియన్లు, 15 మంది ఫ్రాన్స్ జాతీయులు, ఇతర దేశాల వారు ఉండగా, వీరంతా ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles