ఏప్రిల్ మాసంలో ప్రపంచభానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగల ధాటికి ఎండలోకి వెళ్లాలంటేనే ఠారెత్తుతోంది. తెలుగు రాస్ట్రాలపై భానుడు కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నాడా.. అన్నట్లే ఏకంగా 45.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారత వాతారణకేంద్రం అలెర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ, రేపు తెలంగాణలో భానుడు నిప్పుల కొలిమిని తలపింపజేస్తాడని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రజలు ఎండల వేడిమి నుంచి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరీ ముఖ్యమంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. అలాగే, మరో పది జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆయా జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, భానుడి ప్రతాపం నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయాజిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి ఇంట్లోని ఏసీలు ఎంత కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెట్టినా.. కరెంటు దండగే కానీ.. కనీసం చల్లగాలి రావడం లేదంటే ఎండలు ఎంత తీవ్రంగా వున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వేసవి మరో నెల రోజులు పాటు కొనసాగునున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారుతాయోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు అందోళన చెందుతున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మంచినీళ్లను తీసుకోవాలని.. గొడుగులను వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more