Restaurant Shut Down For Preparing Samosas In Toilet టాయిలెట్లో సమోసాల తయరీ.. 30 ఏళ్లుగా ఇదే తంతు..

Saudi arabia restaurant shut down for preparing samosas in toilet for 30 years

Saudi Arabia, Jeddah, Samosa, Food, Jeddah Municipality, restaurant, eatery, residential building, toilet, snacks, health cards, residency law violators

Saudi Arabia has shut down an eatery in Jeddah after discovering that it had been preparing samosas and other snacks in toilets for more than 30 years, local media reported. Acting on a tip-off, Jeddah Municipality raided the 'restaurant' in a residential building which had been operating for more than 30 years. All workers had no health cards and were violators of residency laws.

టాయిలెట్లో సమోసాల తయరీ.. 30 ఏళ్లుగా ఇదే తంతు.. నివ్వెరపోయిన అధికారులు

Posted: 04/26/2022 10:06 PM IST
Saudi arabia restaurant shut down for preparing samosas in toilet for 30 years

అరబ్సు దేశాలలో సౌదీ అరేబియా షెరియా చట్టాన్ని అమలు చేస్తూ... కఠినమైన బహిరంగ శిక్షలను కూడా విధిస్తుంటుంది. దుబాయ్ లో పౌరులకు ఉన్నంత స్వేచ్ఛా సౌదీ అరేబియాలో పౌరులకు ఉండదు. అక్కడి మహిళలు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తే వారికి గత కొన్ని నెలల కింద వాహనాలు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి లభించింది. ఇలా అత్యంత కఠినంగా వ్యవహరించే ఈ దేశంలో ఎవ్వరూ చట్టాలను ఉల్లంఘించరు అని భావిస్తాం. ఇక్కడ అవినీతి, అక్రమాలకు ఆస్కారం తక్కువ అని అందరూ అనుకుంటారు. అయితే ఈ దేశంలోనూ అక్కడక్కడా చట్టాల ఉల్లంఘన జరుగుతుంటుంది.

తాజాగా ఈ దేశంలోని ఓ రెస్టారెంటు అక్రమాలకు పాల్పడుతుందని తేలిచింది. అయితే ఒకటి రెండు కాదు ఏకంగా 30 ఏళ్లకు పైగా ఓ రెస్టారెంటులో జరుగుతున్న తంతును చూసి సౌదీ అరేబియా అధికారులను నిర్ఘాంతపోయేలా చేసింది. ఇటీవల జెడ్డా నగరంలోని ఓ రెస్టారెంటుపై అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా, సమోసాలు, ఇతర స్నాక్స్ ను కిచెన్ లో కాకుండా, అక్కడి టాయిలెట్ లోనూ, ఇతర వాష్ రూముల్లోనూ తయారుచేస్తుండడం వారి కంటబడింది. మరింత లోతుగా విచారిస్తే, గత మూడు దశాబ్దాలకు పైగా సమోసాల తయారీకి టాయిలెట్ నే వినియోగిస్తున్న విషయం వెల్లడైంది.

ఈ రెస్టారెంటులో ఆహార పదార్థాల తయారీకి సంబంధించి అధికారులకు కొంత సమాచారం అందింది. దాంతో వారు రెస్టారెంటులో తనిఖీలు చేశారు. ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారుచేస్తుండడమే కాదు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయి రెండేళ్లు గడిచిన చీజ్, ప్యాకేజ్ డ్ మాంసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ రెస్టారెంటుకు అధికారులు తాళం వేశారు. కాగా, యాజమాన్యం ఆ రెస్టారెంటులో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరికీ హెల్త్ కార్డులు ఇవ్వలేదట. గతంలో, జెడ్డాలో షావర్మా అనే ప్రఖ్యాత రెస్టారెంటును కూడా ఇలాంటి పరిస్థితుల్లోనూ అధికారులు మూసివేశారు. అక్కడి ఆహార పదార్థాలపై ఎలుకలు తిరుగుతుండడం వీడియోల ద్వారా వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles