Pawan Kalyan urges govt. to prevent Ruia Hospital incidents తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై జనసేనాని ఏం అన్నారంటే..!

Is suspension of doctor a justisification pawan kalyan on tirupati ruia ambulance

Tirupati RUIA hospital, Pawan Kalyan, Janasena, Doctor Suspension, pawan kalyan on man carries son corpse on bike, pawan kalyan on man carries son dead body on bike, pawan kalyan on corpse carried on two wheelers, Tirupati RUIA hospital, son dead body, Ambulance drivers, Huge amount, Chitwel Mandal, Annamayya district, Tirupati, Andhra Pradesh

Janasena Chief Pawan Kalyan responds on the incident from Tirupati Ruia General Hospital, where a father was forced to carry his son's dead body on a two-wheeler after the ambulance drivers allegedly demanded a huge amount from him.

వైద్యుడిపై వేటు వేసి.. అంబులెన్స్ దందాపై చేతులెత్తేస్తారా.?: పవన్ కల్యాణ్

Posted: 04/27/2022 11:25 AM IST
Is suspension of doctor a justisification pawan kalyan on tirupati ruia ambulance

ప్రజల అరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యతతో పాటుగా అసుపత్రులలో పరిస్థితి చేజారి మరణించిన రోగుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు పంపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటిది తమ బాధ్యతను తప్పించుకుని.. ఆసుపత్రుల వద్ద యధేశ్చగా అంబులెన్సుల రింగ్ దంగా నడిపిస్తున్నా ప్రభుత్వానికి తెలియకపోవడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు. తిరుపతి రుయా అసుపత్రిలో చోటుచేసుకున్న దయనీయ ఘటనపై యావత్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో కొనసాగుతున్న అక్రమ దందాలకు పరాకాష్టగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

కడప జిల్లా చిట్వేలుకు చెందిన నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయా ఆసుపత్రిలో చనిపోయాడని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే, తండ్రి నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి పడిన కష్టం, వేదన చూశానని తెలిపారు. ప్రైవేటు అంబులెన్స్ ఆపరేటర్లు అడిగినంత డబ్బు ఇవ్వలేక, చనిపోయిన తొమ్మిదేళ్ల కొడుకును భుజంపై వేసుకుని 90 కిలోమీటర్లు బైక్ మీద వెళ్లిన ఘటన కలచివేసిందని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తాను ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో ఎందుకీ దుర్భర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.

ఘటన జరిగిన తరువాత కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రజలతో పాటు తాము ఆశించామని అన్నారు. అయితే విధుల్లో ఉన్న ఓ వైద్యుడ్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, డ్యూటీలో ఉన్న డాక్టర్లు వైద్యం చేయాలా? లేక అంబులెన్సులు పురమాయించాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం పటిష్ఠం చేయకపోవడంవల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఎంతో అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు అంబులెన్స్ సాయాన్ని కోరరు. అంబులెన్సులు డ్రైవర్లు అదే అదనుగా భావించి.. రోగులను.. వారి కుటుంబ సభ్యులను నిట్టనిలువునా లూటీ చేస్తున్నారని అన్నారు.

ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరచి అంబులెన్సుల సేవలను వినియోగించుకునే రోగులకు అధికారికంగా టారిఫ్ ను ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. ఆ టారిప్ ను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నిక్కచ్చిగా చెబితే అంబులెన్స్ డ్రైవర్ల దోపిడికి కళ్లెం పడదా.? అని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం మాత్రం తాంబులాలిచ్చాం తన్నకు చావండీ అన్నట్లుగా.. ఈ ఘటనపై అంబులెన్స్ డ్రైవర్ల అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేసే బదులు.. విధుల్లో వున్న ఓ వైద్యుడిపై వేటు వేసి.. చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ ఒక్క ఘటనే కాదని, రుయా ఆసుపత్రిలో కరోనా వేళ ఆక్సిజన్ కొరతతో 30 మంది మరణించారని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరతపై నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడితే అతడిని వేధించారని పవన్ ఆరోపించారు. ఆ వేదనతోనే సదరు డాక్టర్ చనిపోయారని వెల్లడించారు. ఈ సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపిస్తున్నాయని విమర్శించారు. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆసుపత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయని పేర్కొన్నారు. వాటిపైనా, వాటిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠినచర్యలు తీసుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh