Woman cop saves lifeof woman who fell off moving train తల్లి కోసం పిల్లలు ఎలా తల్లడిల్లుతారో.. ఈ వీడియో..

Viral video woman falls off moving train in mumbai saved by alert guard

Home Guard saves passenger, Mumbai, Jogeshwari railway station, suburban train, platform, mother, daughters, mumbai, maharashtra, viral video

An alert home guard deployed on a suburban train in Mumbai saved the life of a woman passenger who had fallen onto the platform while deboarding a moving train. The woman jumped out of the train but lost balance as she landed on the platform. While trying to regain balance, the woman continued to hold onto the handle on the train's entrance.

ITEMVIDEOS: కదులుతున్న రైలు నుంచి దూకిన ముగ్గురు మహిళలు.. చివరికి..!

Posted: 04/25/2022 08:37 PM IST
Viral video woman falls off moving train in mumbai saved by alert guard

కదులుతున్న రైలు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. రైలు నుంచి దిగే క్రమంలో అమె రైలు ద్వారం వద్దనున్న హ్యాండిల్ ను బలంగా పట్టుకోవడంతో ఫ్లాట్ ఫామ్ పై పడింది. అయితే తమ తల్లి పడిపోయిన వెంటనే దానిని గమనించి అమె ఇద్దరు ఆడపిల్లలు తల్లిని కాపాడుకునే క్రమంలో వారు కూడా రైలు నుంచి దూకడం వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అయితే అదే రైలు బోగిలో అప్రమత్తంగా ఉన్న హోంగార్డు.. ఆ మహిళను రక్షించారు.

ముంబైలోని జోగేశ్వర్​ రైల్వేస్టేషన్​లో జరిగిన ఈ ఘటన వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ప్రయాణికులు ఎవరూ కదులుతున్న రైలు నుంచి దిగడం కానీ, ఎక్కడం కానీ చేయరాదని మరోమారు విన్నవించారు. ఇక జోగేశ్వర్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ తల్లి తన ఇద్దరుకూతుళ్లతో రైలు ఎక్కింది. అయితే ఆ రైలు తాము అనుకున్న చోటకి వెళ్లడం లేదనో లేక మరే కారణమో తెలియదు కానీ రైలు నుంచి దిగి ప్రయత్నం చేసింది. అప్పటికే కదులుతున్న రైలు నుంచి ప్లాట్​ఫామ్​ మీదకు దూకేందుకు ఆ మహిళ ప్రయత్నించి.. రైలు వేగం అందుకోవడంతో బ్యాలెన్స్​ కోల్పోయి ఒక్కసారిగా కిందపడిపోయింది. అలా.. ప్లాట్​ఫామ్​, రైలు కింద పడిపోబోయింది.

అదే సమయంలో ఆ ఘటనను రైలులో ఉన్న హోంగార్డు అల్తాఫ్​ షేక్​ చూశారు. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన ఆయన.. ఆమెను వెంటనే పక్కకు లాగేశారు. ఫలితంగా ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అమెకు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనను రైలులో వున్న అమె ఇద్దరు కూతుళ్లు చూశారు. తమ తల్లికి ఏదో జరిగిందని భావించిన వారు.. వెనకాముందు అలోచించకుండా వెంటవెంటనే రైలు నుంచి కిందకు దూకారు. అయితే ఇద్దరు అదుపు తప్పి ఫ్లాట్ ఫామ్పై పడినా.. వారిు ఎలాంటి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లలేదు.

ఈ నెల 16న జనిగిన ఈ ఘటన వీడియోలో తల్లి కోసం పిల్లలు ఎంతగా అలమటించిపోతారు.. వారికి ఏదైనా అపద వస్తే వారు ఎలా రియాక్ట్ అవుతారో ఇట్టే కనబడింది. కానీ కాస్తా చూసుకుని ఉండే బాగుంగేదన్న సూచనలు వినిపిస్తున్నాయి. కాగా.. అప్రమత్తంగా ఉండి ఓ మనిషి ప్రాణాలు కాపాడిన హోంగార్డును స్థానిక యంత్రాంగా అభినందించింది. ఆయనకు రివార్డులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. నెటిజన్లు సైతం.. హోంగార్డుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన అనంతరం.. రైల్వే పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. రైలు ఎక్కేడప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles