Black Baza spotted for the first time in Telangana అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అరుదైన అతిథి

Black baza spotted for the first time in amrabad tiger reserve

Black Baza spotted in Nagar kurnool, Black Baza spotted in Nallamala, Black Baza spotted in Amrabad tiger rwserve, Black Baza spotted in Telangana, amrabad tiger reserve, black baza, china, himalayas, madan reddy ryapaku, Nagar kurnool, Nalla Malla forest, telangana

Amrabad Tiger Reserve (ATR) officials said for the first time a Black Baza was sighted in the reserve on April 9 this month. This was also first time Black Baza was spotted in Telangana and Andhra Pradesh, they said. ATR Divisional Forest Officer (DFO) Rohit Gopidi confirmed that a Black Baza was spotted in the tiger reserve as per the e-bird, an online database of bird observations.

అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అరుదైన అతిథి

Posted: 04/22/2022 12:02 PM IST
Black baza spotted for the first time in amrabad tiger reserve

న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో అరుదైన అతిధి చేరకుంది. ఎవరా అతిధి అంటే.. ఆగ్నేయ అసియా ఖండంతో ఎక్కువగా దర్శనమిచ్చే అరుదైన ప‌క్షి తెలంగాణలోని అమ్రాబాద్ అడవుల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ ప‌క్షి పేరు కూడా విచిత్రంగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని పక్షి తాజాగా కనిపిస్తోంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న “బ్లాక్ బాజా” తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టులో బ్లాక్ బాజ ప‌క్షి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్లు డివిజ‌న‌ల్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ రోహిత్ గోపిడి తెలిపారు. ఏప్రిల్ 9న న‌ల్ల‌మ‌ల అడవుల్లో బ్లాక్ బాజ క‌నిపించిన‌ట్లు పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్ మ‌ద‌న్ రెడ్డి ర్యాపాకు ఈ అంద‌మైన బ్లాక్ బాజ ప‌క్షిని త‌న కెమెరాలో బంధించారు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో బ్లాక్ బాజ ప‌క్షి ఆన‌వాళ్లు లేవ‌ని ఆ ఫోటో గ్రాఫ‌ర్ చెప్పారు. ఈ ప‌క్షి సాధార‌ణంగా ఈశాన్య భార‌త‌దేశం, తూర్పు హిమాల‌యాలు, చైనా, ఆగ్నేయాసియా అడ‌వుల్లో క‌నిపిస్తుంద‌ని రోహిత్ వెల్ల‌డించారు. ఇవి గ‌ద్ద‌లు, రాబందుల జాతికి సంబంధించిన ప‌క్షులు అని పేర్కొన్నారు. బ్లాక్ బాజ‌లు సాధారంగా ద‌ట్ట‌మైన అడ‌వుల్లో త‌రుచుగా క‌నిపిస్తాయి. వన్య‌ప్రాణుల పెరుగుద‌ల‌కు అనుకూల‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేయ‌డానికి అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో విస్తృత‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని రోహిత్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles