Call Recording Apps to be Banned by Google 'కాల్​ రికార్డింగ్'​ ఇక అసాధ్యం! చర్యలకు ఉపక్రమించిన గూగుల్.!

Google to kill call recording apps android users will not be able to record calls

google, google android, android, google dialer, google dialer call recording, call recording, call recording android, call recording apps, best call recording apps

Google is ending support for third-party call recording apps with a new change to Android. An upcoming update to the Google Play Policy will kill the feature on all third-party recording apps that functioned in calls, conferences and any other similar use-cases.

'కాల్​ రికార్డింగ్'​ ఇక అసాధ్యం! చర్యలకు ఉపక్రమించిన గూగుల్.!

Posted: 04/21/2022 08:58 PM IST
Google to kill call recording apps android users will not be able to record calls

గూగుల్​ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో థర్డ్​ పార్టీ కాల్ రికార్డింగ్​ యాప్స్ అన్నింటికీ సపోర్ట్ నిలిపివేసేందుకు సిద్ధమైంది. దీంతో వాయిస్ కాల్​సంభాషణలను రికార్డు చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. అవతలి వ్యక్తి వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం ఇక కుదరదు. ఈ నిబంధనలను వచ్చే నెల అనగా, మే 11 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశముంది. మెజార్టీ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్​ను తయారు చేసే గూగుల్​ సంస్థ.. కాల్ రికార్డింగ్​కు ఎప్పుడూ వ్యతిరేకమే.

అవతలి వ్యక్తికి చెప్పకుండా సంభాషణ రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్నది గూగుల్ వాదన. అందుకే కాల్ రికార్డింగ్ యాప్స్​ కట్టడికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ 6 ఓస్​ తెచ్చినప్పుడు ఈ యాప్స్​పై తొలిసారి వేటు వేసింది గూగుల్. కాల్ రికార్డింగ్​కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే.. యాప్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. సరికొత్తగా మళ్లీ కాల్ రికార్డింగ్ యాప్స్​ తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్​​ 9 ఓఎస్​లో వాటికీ కళ్లెం వేసింది గూగుల్. అయితే.. ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఏపీఐని ఉపయోగించి కొందరు యాప్ డెవలపర్స్​ మళ్లీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై వేటు వేస్తోంది గూగుల్.

కాల్ రికార్డింగ్ ఇక అసాధ్యమా?: గూగుల్ వర్గాల ప్రకారం.. మే 11 నుంచి థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా కాల్​ రికార్డింగ్​ కుదరదు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ డిఫాల్ట్​గా ఇచ్చే డయలర్​(ఉదాహరణకు ఎంఐ డయలర్) ద్వారా మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. గూగుల్ డయలర్​ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే.. అవతలి వ్యక్తికి కూడా తెలిసేలా 'ఈ కాల్ రికార్డ్ అవుతుంది' అని అలర్ట్ వస్తుంది. దీంతో అవతలి వ్యక్తి కూడా అలర్ట్ కావచ్చు. దీంతో ఎవరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా గూగుల్ చర్యలకు ఉపక్రమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles