SC cancels bail granted to Ashish Mishra కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడికి సుప్రీంలో చుక్కెదురు.!

Lakhimpur kheri case sc cancels bail granted to ashish mishra by the allahabad hc

Lakhimpur Kheri, Farmers Protest, Union Minister, Ajay Kumar Mishra, mow down farmers, Ashish Mishra, Allahabad High Court, Chief Justice N V Ramana, Justice Surya Kant, Justice Hima Kohli, Supreme Court, Uttar pradesh, politics, Crime

The Supreme Court on April 18 cancelled the bail granted by the Allahabad High Court to Ashish Mishra, son of Union Minister Ajay Kumar Mishra, in Lakhimpur Kheri violence case. The apex court further directed Ashish Mishra to surrender within a week. He was granted bail by the high court on February 10. A special bench of Chief Justice N V Ramana and Justices Surya Kant and Hima Kohli held that the high court took into account irrelevant considerations and gave extra weightage to the contents of the FIR.

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడికి సుప్రీంలో చుక్కెదురు.!

Posted: 04/18/2022 03:39 PM IST
Lakhimpur kheri case sc cancels bail granted to ashish mishra by the allahabad hc

లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనల్లో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను తన పరిధి మేర ప్రభావితం చేసేందుకు బెయిలు పోందిన అశిష్‌ మిశ్రాకు తాజాగా అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. రైతులు తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తూ.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన క్రమంలో.. వారిపై నుంచి వాహనాలను నడుపుకుంటూ.. అడ్డువచ్చిన రైతులను తోక్కించుకుంటూ వెళ్లిన ఘటనలో సర్వోన్నత న్యాయస్థానం అతడ్ని నిందితుడిగా పరిగణించింది.

ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు నిందితుడు అశీస్ మిశ్రాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ బెయిల్ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులతో పాటు ప్రభుత్వానికి నోటీసులు అందించిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ కు అభ్యంతరాలను తెలపడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించిరది., ఇక ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం అశీశ్ మిశ్రాకు బెయిల్‌ రద్దు చేసింది. అంతేగాక వారంలోగా లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది.

కాగా గతేడాది అక్టోబర్‌లో లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి 10న అలహాదాబ్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరుచేసింది. ఆశిష్‌కు అలహాబాద్‌ హైకోర్టు బెయిలివ్వడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ నాలుగో తేదీన విచారణ పూర్తి చేసింది. బెయిల్ రద్దుచేస్తూ తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles