TTD sends a good news to SriVari devotees శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Tirumala tirupati devastanam board sends a good news to srivari devotees

Tirumala Tirupati Devastanam good news, TTD good news to devotees, Seven Hills Diety, Lord Venkateshwara Swamy, temple committee, Sri Vari Mettu Margam, Andhra Pradesh, Devotional

Tirumala Tirupati Devastanam Board sends a good news to the Seven Hills Diety Lord Venkateshwara Swamy devotees, that is the temple committee is to bring the availabilty of Sri Vari Mettu Margam, to the devotees. This way was damaged due to heavy rains in the November and will be resumed from May 1st.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆ మార్గం అందుబాటులోకి..

Posted: 04/18/2022 01:17 PM IST
Tirumala tirupati devastanam board sends a good news to srivari devotees

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన చేరుకునే భక్తుల కోసం కూడా శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఇటీవల శ్రీవారి మెట్టు మార్గం ద్వారా భక్తుల రాకపోకలను టీటీడీ దేవస్థానం బోర్డు నిలిపివేసింది. కాగా ఈ మార్గాన్ని అతిత్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.

గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమయింది. భక్తులు కొండపైకి ఎక్కలేనంతగా దెబ్బతింది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని టీటీడీ మూసివేసింది. ఇక గత ఐదు నెలలుగా ఈ మార్గంలో అనేక మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో ఐదునెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ఈ సందర్భంగా టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో, ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది. శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకోనుండటంపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్ మెంట్లలో భక్తులను ఉంచి, సర్వదర్శనానికి అనుమతిని ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం, వసతి, పాలు, తాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles