కరోనా పురుడుపోసుకున్న చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపపరివర్తన ఎక్స్ఈ వేరియంట్ విజృంభిస్తూ.. ఆ దేశంలోని పలు కీలకమైన నగరాలతో పాటు వ్యాపారనగరాల్లోనూ లాక్ డౌన్ కు కారణమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మన దేశంలోనూ ఈ వేరియంట్ ఉనికి బయటపడిందన్న వార్తలు దేశప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మూడు దశల్లో ఏకంగా ఐదు లక్షల 22 వేల పైచిలుకు మంది ప్రాణాలను ఈ ప్రాణాంతక మహమ్మారి బలి తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు దీని బారిన పడి కోలుకున్న అనేకులలో అరోగ్యపరంగానూ తీవ్ర ప్రభావం చాటింది. ఈ నేపథ్యంలో మరోమారు ప్రాణాంతక ఎక్స్ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిందన్న వార్త ప్రజలను కలవరపరుస్తోంది.
పలు దేశాలలో నాలుగో పర్యాయం లాక్ డౌన్లకు కారణమవుతున్న ఒమిక్రాన్ బి 1ఏ, బి2ఏ వేరియంట్ల ఉపపరివర్తనమే ఈ ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్. కాగా, ఈ వేరియంట్ కు సంబంధించిన తొలి కేసు మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. బ్రిటన్‌లో జనవరి 19న ఈ ఎక్స్ఈ వేరియంట్ తొలికేసు నమోదుకాగా.. రెండురోజుల క్రితం మనదేశంలో ఈ వేరియంట్ వెలుగుచూసింది. అయితే ఇది ఎక్స్ఈ వేరియంట్ కాదని, మరోమారు ఈ రోగి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కేంద్ర చెప్పడంతో దేశప్రజల్లో కలవరానికి పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా గుజరాత్ లో ఎక్స్ఈ వేరియంట్ బయటపడటంతో కలవరం ప్రారంభమైంది.
గుజరాత్ లో మార్చి 13న వడోదర పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ ఉన్నట్టు గుర్తించగా, రోగి వారం రోజుల్లో కోలుకున్నట్టు వైద్య అధికారులు తెలిపారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ గా తేలడంతో మరోసారి నిర్ధారించుకునేందుకు శాంపిల్ ను పంపించినట్టు చెప్పారు. ఈ ఎక్స్ఈ వేరియంట్ మిగిలిన కరోనా వేరియంట్ల కంటే ఎక్కువ వేగంగా (10 శాతం) విస్తరించే గుణం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు. కరోనాలో కప్పా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న విషయం తెలిసిందే. కాగా ఒమిక్రాన్ వేరియంట్లలోనే ఎక్స్ఈ వేరియంట్ అత్యంత వేగాంగా వ్యాప్తి చెందుతున్న వార్తలతో దేశ ప్రజల్లో అందోళన ప్రారంభమైంది.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ల బయటపడిన నేపథ్యంలో దాని లక్షణాలపై జరిగిన అధ్యయనంలో తీవ్రమైన లక్షణాలు లేవని తేలింది. అయితే దీని ఉపపరివర్తన వేరియంట్లు బిఏ1, బిఏ2లు కూడా పెద్దగా ప్రభావం చూపని వేరియంట్లని అధ్యయనాల్లో తేలింది. ఇక తాజాగా అత్యంత వేగంగా విజృంభిస్తున్న ఎక్స్ఈ వేరియంట్ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన వేరియంట్ కాదని వైరాజిస్టులు తెలిపారు. ఇక కరోనాలో ఎక్స్ఎం అనే కొత్త రకం కేసులు గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కోటి వెలుగు చూశాయి. కరోనా ఒమిక్రాన్ ఉపరకాల కలయికే ఎక్స్ఈ, ఎక్స్ఎం కేసులు. కాగా, కొత్త వేరియంట్‌పై అధ్యయనం జరుగుతోందన్న కేంద్ర ప్రభుత్వం ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more