Alien and human sexual encounter left a woman pregnant? ఏలియన్స్ తో గర్భవతైన మహిళ.. పెంటగాన్ నివేదిక సంచలనం

Woman got pregnant after sexual encounter with alien claims new us defence report

alien, woman, pregnant, aliens humans sex, alien woman pregnant, woman pregnancy alien, UFO, US, Pentagon, health effects, paranormal, alien documents, USA, aliens usa, conspiracy theory, alien conspiracy theory, UFO

Several witnesses have alleged that UFOs have had sexual encounters with humans and also left one woman pregnant. The absurd claims were made in Pentagon documents from the Defense Intelligence Agency, as obtained and reported by The Sun. The report was obtained as part of a Freedom of Information request.

ఏలియన్స్ తో గర్భవతైన మహిళ.. పెంటగాన్ నివేదిక సంచలనం

Posted: 04/08/2022 08:10 PM IST
Woman got pregnant after sexual encounter with alien claims new us defence report

గ్రహాంతరవాసుల గురించి ఎప్పటి నుంచో ఎంతో చర్చ జరుగుతోంది. ఏలియన్స్ ను ప్రత్యక్షంగా కొందరు చూసినట్టు, వారు ప్రయాణించే ఫ్లయింగ్ సాసర్లను చూసినట్టు ఎన్నో కథనాలు ఉన్నాయి. ఇక పదేళ్ల క్రితం గ్రహాంతర వాసుల అవశేషాలు కూడా లభ్యమైనట్లు వార్తలు వచ్చాయి. గ్రహాంతర వాసుల గురించి ఎన్నో ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఏలియన్స్ తో మానవులు శృంగారంలో కూడా పాల్గోన్నారని తాజా కథనం ఒకటి ప్రచారంలో వుంది. ఔరా నిజమేనా.. గ్రహాంతరవాసులతో మానవుల శృంగారం సాధ్యమేనా.? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఇది నిజం.

మానవులతో శారీరక సంబంధాలను కలిగి ఉండటమే కాకుండా వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిదనే వార్త ఇప్పడు సంచలనంగా మారింది. అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నా.. ఇది నిజమని అగ్రరాజ్యం అంటోంది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్టులో ఏలియన్ కారణంగా ఒక మహిళ గర్భం దాల్చిందని ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్త 'ది సన్' ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది.

ఈ రిపోర్టు 1,500కు పైగా పేజీలను కలిగి ఉంది. కనీసం ఐదు సార్లు ఏలియన్, హ్యూమన్ సెక్సువల్ ఎన్ కౌంటర్లు జరిగినట్టు రిపోర్టులో ఉంది. ఒక మహిళ గర్భవతి అయినట్టు రిపోర్టు పేర్కొంది. ఏలియన్స్ ను, వాళ్లు ప్రయాణించే ఎగిరే పళ్లాలను చూసిన వారు అసాధారణ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలిపింది. జుట్టు రాలడం, తలనొప్పి, పీడ కలలు, చర్మంపై కాలిన గాయాలు, గుండె దడ, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పింది. ఫ్లయింగ్ సాసర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఇలా జరిగుండొచ్చని తెలిపింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వార్త సెన్షేషనల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alien  woman  pregnant  aliens humans sex  UFO  US  Pentagon  health effects  paranormal  

Other Articles