Yadadri set to open for devotees from today యాదాద్రి లక్ష్మీనృసింహుడి నిజరూప దర్శనం..

Telangana chief minister kcr inaugurates sri lakshmi narasimha swamy temple in yadadri

Yadadri, CM KCR inauurates Yadadri Temple, Sri Lakshmi Narasimha Swamy Temple Yadadri, Telangana Tirumala, Telangana Tirupati, KCR’s Rs 1,800 crore dream temple project, Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple inaugurated, All you need to know Telangana Tirumala Yadadri, Sri Laxmi Narasimha Swamy Temple, Inauguration, Yadadri, Telangana, Devotional

Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday inaugurated the Sri Lakshmi Narasimha Temple at Yadadri Bhuvanagiri district. Located 80 km away from Hyderabad, the state government has spent about Rs 1800 crore on the renovation of the ancient temple, Sri Lakshmi Narasimha Swamy Temple in Yadadri.

ITEMVIDEOS: యాదాద్రి లక్ష్మీనృసింహుడి నిజరూప దర్శనం.. శోభాయాత్రలో సీఎం కేసీఆర్..

Posted: 03/28/2022 01:18 PM IST
Telangana chief minister kcr inaugurates sri lakshmi narasimha swamy temple in yadadri

తెలంగాణ ప్రజల పాలిక కొంగుబంగారమై యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూపదర్శనం ఇవాళ్టి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. యాదాద్రిలో మహాకుంభసంప్రోక్షణ చేసిన అనంతరం మహాక్రతవుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేస్తున్న తరుణంలో గత ఏడేళ్లుగా బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామిదేవేరులు.. ఇకపై నూతనంగా నిర్మితమైన ఆలయంలో నిజరూప దర్శనం ఇస్తూ భక్తులకు అభయ ప్రధానం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ స్వామివారికి తొలిభక్తుడిగా పూజలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. యాదాద్రి లక్ష్మీనరసింహుల ఆలయాన్ని నవ వైకుంఠక్షేత్రంగా తీర్చిదిద్దింది. భక్తులును ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా హాజరై తొలిపూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు దేవాదాయశాఖ మంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కుటుంబసమేతంగా పాల్గోన్నారు. ఆ తరువాత శ్రీలక్ష్మీ నృసింహస్వామివార్ల నిజరూప దర్శనానికి భక్తజనులను అనుమతించనున్నారు.  

యాదగిరిగుట్టపై అడుగుపెట్టింది మొదలు, స్వామివారిని దర్శించుకొనేవరకు కనులముందు కనిపించే అణువణువూ ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచుతుంది. పట్టణంలోకి అడుగుపెట్టగానే ఓం నమో నారసింహాయ మంత్రం ఒంట్లో భక్తిభావాన్ని పెంపొదిస్తుంది. అలా ఆలయంవైపు అడుగులు వేయగానే కొండపైనున్న సప్త గోపురాలు స్వర్గలోక వైకుంఠాన్ని చూసినంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్లగానే వైకుంఠ ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా ప్రధానాలయానికి చేరుకోవచ్చు.

పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం కన్నులపండువగా జరిగాయి. శాస్ర్తోక్తంగా 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. కలశాల్లో పవిత్ర జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలను నింపి సుదర్శన చక్రం, పెరుమాళ్లు, గోదాదేవి, గరుడ, విష్వక్సేన, ప్రతిష్ఠామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో షోడశకళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం పర్వాలను నిర్వహించినట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం కొనసాగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles