Trade Unions Call for 2-Day Bharat Bandh From Today కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు బ్యాంకుల సమ్మె

Bharat bandh bank unions strike partially impacts banking services

bharat bandh, bharat bandh bank strike, bharat bandh news, bharat bandh 2022, bank strike today, bank strike news, bank strike tomorrow, bank strike 2022, bank strike latest news, bank strike march 2022, bank strike news 2022, bank strike in march, bank strike date, Bank Strike, Bharat Bandh news, Bharat Bandh updates

A 48 hours Bharat bandh or a nationwide strike called by different trade unions to protest against government policies has kicked off in several states on Monday. The strike will be observed for two days, March 28 and 29. Most of the banks, including State Bank of India (SBI), had informed their customers about the proposed strike and likely impact on the services in advance.

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ, రేపు బ్యాంకుల సమ్మె

Posted: 03/28/2022 11:45 AM IST
Bharat bandh bank unions strike partially impacts banking services

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇవాళ రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. వారిపై అధికభారం మోపడం మానేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని కేంద్ర కార్మిక సంఘాలు 48 గంటల భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. సోమవారం నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త సమ్మె మంగళవారం సాయంత్రం ముగియనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఈ సమ్మెలో బ్యాంకింగ్ రంగంతో పాటు రవాణా రంగానికి చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో బలంగా పాల్గోంటున్నాయి. వీటితో పాటు బోగ్గు, ఉక్కు, టెలికాం, ఆదాయపన్ను, రాది, ఇన్సూరెన్సు సహా మరికొన్ని రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్టోంటున్నాయని కార్మిక సంఘాల ఐక్యవేదక తెలిపింది. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కలసి రావాలని కూడా విన్నవించామని తెలిపాయి. చట్టాల్లో సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉపాధిహామీ నిధుల్లో కోతలకు వ్యతిరేకంగా.. అలాగే, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

సమ్మెకు దిగుతున్నట్టు పలు రంగాలకు చెందిన కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంది. వీరితోపాటు రోడ్డు రవాణా, విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపింది. రైల్వే, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా సమ్మెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తాయని వివరించింది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి. మరోవైపు, ఈ సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా మద్దతు ఇస్తుండడంతో రెండు రోజులపాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles