తెలంగాణలో యువతను సక్రమైన బాట పట్టేలా ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న కృషికి తూటాలు పోడుతూ.. ఓ రౌడీ గ్యాంగ్ తమ రౌడీయిజాన్ని ప్రదర్శించగా, వారికి చిరువ్యాపారులు అందరూ కలసి గట్టిగానే బుద్ది చెప్పారు, ఓ రౌడీ రోడ్డుపై వెళ్తూ. నేరుగా కొబ్బరిబొండాం అమ్ముకునే చిరువ్యాపారి వద్దకు వచ్చి బొండాలు తాగారు. డబ్బులు అడిగే సరికి వారు సైకోలా మారిపోయారు. దురలవాట్లు, చెడు సహవాసాలు, తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇందుకు ఓ రకంగా కారణమే.. కొబ్బరి బోండాలు తాగాక డబ్బులు అడిగినందుకు బండి యజమానిపై దాడికి దిగారు కొందరు యువకులు. సినిమా స్టైల్లో రౌడీయిజం చేస్తూ.. కత్తులు, కర్రలతో దాడికి దిగారు.
తెలంగాణలోని కూకట్పల్లి షంశీగూడ నాలా వద్ద కొంతకాలంగా నరేందర్ అనే వ్యక్తి కొబ్బరి బోండాల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం సాయంత్రం యువకుడు కుల్దీప్ సింగ్.. ఇద్దరు స్నేహితులతో రోడ్డుమీద వెళ్తూ.. దారిలో ఈ కొబ్బరి బోండాల బండి దగ్గర ఆగారు. బోండాలు తీసుకున్నారు. దాహం తీరేలా తాగారు. అనంతరం బండి యజమాని బోండాల డబ్బులు అడిగారు. ఇంతలో ఆ యువకులకు ఏమైందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా? అంటూ దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగక.. రాధాకృష్ణ, హర్దీప్ సింగ్ అనే మరో ఇద్దరిని తీసుకొచ్చి ఘర్షణకు దిగారు.
ఇదంతా అక్కడుండి గమనిస్తున్న స్థానికులు, పరిసరాల్లోని చిరు వ్యాపారులు చూస్తూ ఊరుకోలేదు. రౌడీయిజానికి దిగిన యువకులపైకి తిరగబడ్డారు. బుద్ధిగా వ్యాపారం చేసుకుంటున్న అతనిపై దాడిని ఖండిస్తూ.. కర్రలతో వారిని తరిమితరిమి కొట్టారు. దారిలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆ సంఘటనను చోద్యంలా చూస్తుండగా.. మరికొందరు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు తమ చరవాణీల్లో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా కోణంలో విచారణ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more