Traffic Police to offer discount on pending challans వాహనాల పెండింగ్ చలాన్లలకు బ్రేక్.. మళ్లీ అప్పుడే ఓపెన్

Traffic police receive rs 5 5 cr on discounted challans on day one

Hyderabad Traffic Police, discount on traffic challans, motorists, Traffic police, discounted challans, Traffic department, Hyderabad commissionerate, Cyberabad commissionerate, Rachakonda commissionerate, Two Wheelers, Four Wheelers, heavy vehicles, RTC buses, push carts, not wearing a mask, waiver of 90 per cent on mask challans, telangana e-challan, traffic police, Telangana, Crime

The traffic police issued a notification stating that pending challans on vehicles will be discounted from March 1 to 31. It was the day the citizens were waiting for their dream come true. As soon as the website turned active, they made a beeline to make payments and get discounts.

ట్రాఫిక్ పోలీసుల సర్వర్లు డౌన్.. వాహనాల పెండింగ్ చలాన్లలకు బ్రేక్..

Posted: 03/01/2022 04:56 PM IST
Traffic police receive rs 5 5 cr on discounted challans on day one

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పినా.. సర్వర్లు మాత్రం సహకరించలేదు. దీంతో లక్షలాది వాహనాలపై కోట్లాది రూపాయల ఛలాన్లను రాబట్టుకోవడంలో ట్రాఫిక్ పోలీసుల అంచనాలు మించిపోయాయి. అంటే వారు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు వాహనదారులు స్పందించారు. ఉదయం నుంచి పోటీపడి మరీ నిమిషానికి 700 నుంచి వెయ్యి చాలన్ల వరకు పెనాల్టీలు కట్టేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల సర్వర్లు ఒత్తిడిని తట్టుకోలేక బ్రేక్ డౌన్ అయ్యియి. దీంతో వాటిని సరిచేసే పనిలో నిపుణులు నిమగ్నమ్యాయరు. ఫలితంగా వాహనాలకు పెండింగ్ చలాన్ల చెల్లింపులకు బ్రేక్ పడింది. సర్వర్ల పునరుద్దరణ తరువాతే మళ్లీ సేవలు ప్రారంభం కానున్నాయి.

రాయితీలిస్తే షాపింగ్ సెంట్లకు కస్టమర్లు బారులు కడతారని తెలుసుకానీ, అదే డిస్కౌంట్ తమకు ఇస్తే ఇంతటి రద్దీ ఉంటుందని, సర్వర్లు కూడా జామ్ అవుతాయని నిరూపించారు వాహనదారులు. పెండింగ్​ చలాన్లపై రాయితీ ఇవ్వడంతో పోటీపడిన వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే పనిలో ఉదయం నుంచే నిమగ్నమయ్యారు. శివరాత్రి అఫర్ తమకు ఇలా కలసివచ్చిందనుకున్న వాహన దారులు ఉదయం నుంచి చలాన్లను కడుతూ.. తమ చలాన్లు అన్ని క్లియర్ అయిన స్నాప్ తీసుకుని తమ స్నేహితులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారీగా రద్దీ పెరిగింది. ఫలితంగా సర్వర్ ​డౌన్​ అయింది. ప్రస్తుతం రోజుకు 3 లక్షల మంది చెల్లించే సామర్థ్యంతోనే సర్వర్లు సిద్ధం చేయగా.. తొలి రోజు నుంచే ఆన్​లైన్‌లో రద్దీ పెరిగింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకే చలాన్ల సర్వర్​ డౌన్​అయింది.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ‌చలాన్లు భారీ ఎత్తున పేరుకుపోగా.. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ల‌లో ఏకంగా రూ.600 కోట్ల పైచిలుకు విలువ క‌లిగిన ‌చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటి సొమ్మును రాబ‌ట్టుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ భారీ రిబేట్‌తో ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు పిలుపునిచ్చింది. 30 శాతం మొద‌లు 80 శాతం దాకా రిబేట్ ప్ర‌క‌టిస్తూ.. పెండింగ్ ‌చలాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోవాలంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆఫ‌ర్‌కు వాహ‌న‌దారుల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. ఈ నెల 1 నుంచి ఈ నెల 30దాకా గ‌డువు విధించినా... తొలిరోజే వాహ‌న‌దారులు త‌మ పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్ కోసం పోటెత్తారు.

మార్చి 1 నుంచి వాహనాలపై ఉన్న ఫైన్లకు రాయితీ ఇస్తుండటంతో మంగళవారం ఉదయం నుంచి భారీగా పెండింగ్ చలాన్లు చెల్లిస్తున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ లతో పాటు మీ సేవ/ ఈ సేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు అనుమతించారు. అయితే, ఒక్క సారిగా అధిక సంఖ్యలో వెబ్ సైట్ ను ఓపెన్ చేయడంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పేమెంట్ గేట్ వే ఆఫ్షన్​దగ్గరకు రాగానే సమస్య వచ్చింది. దీంతో పేమెంట్​ ఆగిపోయింది. వెబ్​సైట్​మళ్లీ పదేపదే బ్రౌజ్​ చేసినా.. పేమెంట్​ ఆగిపోయింది. వెబ్​సైట్​లో మాత్రం వెంటనే తొందరపడొద్దు.. ఈ నెల 31 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది అంటూ పొందుపర్చిన సమాచారం చూపిస్తోంది.

కాగా, పెండింగ్ చలానాలు చెల్లించేవారు ఒక్కసారిగా ఈ-చలాన్ వెబ్ సైట్లోకి వెళితే సర్వర్ కుప్పకూలకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని హైదరాబాద్​ ట్రాఫిక్​పోలీసులు వెల్లడించారు. సర్వర్ సామర్థ్యాన్ని పదిరెట్లు పెంచామని, తొలిరోజు లక్ష నుంచి 3 లక్షలమంది చెల్లించే అవకాశాలున్నాయన్న అంచనాతో సర్వర్ ను సిద్ధం చేశామన్నారు. కానీ, అంచనాలకు మించి వాహనదారులు ఈ-చలాన్ వెబ్ సైటు సందర్శించడంతో సర్వర్ కుప్పకూలింది. అయితే, రెండు రోజులు తాత్కాలిక విరామం ప్రకటించి, ఈ సర్వర్లకు మరింత సామర్థ్యం అందుబాటులోకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం మేరకు కంటిన్యూ చేయాలా.. సర్వర్ల సామర్థ్యం పెంచాలా అనే విషయమై బుధవారం నిర్ణయం తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles