40-mile Russian convoy threatens Kyiv కివ్ సమీపంలో రష్యా బలగాల 64 కీమీ వాహనశ్రేణి

Huge russian military convoy stretching 64 km spotted north of ukraine capital kyiv

Russia Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelenskyy, Russian troop, Russian tanks, Russian troops on Kyiv, russia ukraine, russia ukraine crisis, russian forces in Ukraine, Kyiv

A 40-mile convoy of Russian tanks and other vehicles threatened Ukraine’s capital Tuesday as an intense shelling attack targeted the country’s second-largest city, and both sides looked to resume talks in the coming days aimed at stopping the fighting.

ఉక్రెయిన్ రాజధాని కివ్ సమీపంలో రష్యా బలగాల 64 కీమీ వాహనశ్రేణి

Posted: 03/01/2022 03:08 PM IST
Huge russian military convoy stretching 64 km spotted north of ukraine capital kyiv

ఉక్రెయిన్ పై మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రష్యా.. ఓ వైపు శాంతి సందేశం అంటూ చర్చాలకు ఆహ్వానిస్తూనే.. మరో వైపు ఉక్రెయిన్ ను తమ హస్తగతం చేసుకోవాలన్ని కోణంలోనే తమ సైనిక బలగాలను రంగంలోకి దింపింది. బాలసోర్ లో ఉక్రెయిన్ తో శాంతి చర్చలు నిర్వహిస్తూనే. ఈ తెరవెనుక పథకానికి రష్యా ప్రణాళిక వేసింది. దీంతో ఉక్రెయిన్ పై పూర్తి పట్టు సాధించే దిశగా రష్యా బలగాలు తమ వైరి దేశంలో సన్నధం అవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని బేరిజు వేసుకుని శాంతిచర్చలు జరుపుతున్నారన్న అంచనాలకు రష్యా తిలోదకాలు ఇచ్చింది. ఉక్రెయిన్ పై పూర్తి పట్టుసాధించే వరకు వెనక్కి తగ్గబోమని తాజాగా రష్యాసేనలు కవాతు స్పష్టం చేస్తోంది.

ఓవైపు యుద్దంలో తమ సైన్యం ప్రాణాలను కోల్పోతున్నా.. మరింత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పై దాడికి రష్యా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఉత్తర దిక్కు నుంచి రష్యా సైన్య వాహన శ్రేణి పెద్ద ఎత్తున ముందుకు కదులుతోంది. 64 కిలోమీటర్ల మేర వున్న రష్యా సైనికుల కాన్వాయ్ ముందుకు సాగుతున్నట్లు అమెరికా టెక్నాలజీ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. గతంలో తీసిన చిత్రాలను పరిశీలిస్తే అప్పుడు 27 కిలోమీటర్ల మేరే రష్యా సైన్యం కనిపించగా, తాజాగా అది రెట్టింపు కావడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

ఆయుధాలతో కూడిన వాహనాలు, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, కావాల్సిన సామగ్రితో కూడిన వాహనాలు రష్యా సైనిక కాన్వాయ్ లో కదులుతున్నాయి. దక్షిణ బెలారస్ లో క్షేత్రస్థాయిలో సైనికుల మోహరింపు, హెలికాప్టర్ యూనిట్లు కూడా శాటిలైట్ ఫొటోల్లో కనిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలోని ఆంటనోవ్ ఎయిర్ పోర్ట్ దిశగా రష్యా సైనిక కాన్వాయ్ ప్రయాణం చేస్తోంది. మరోపక్క, రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో సోమవారం జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వకుండా ముగియడం తెలిసిందే. మరో విడత చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. తదుపరి చర్చల్లో ఎంతో కొంత పురోగతి ఉంటే యుద్ధం సమసిపోయే అవకాశాలు బలపడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles