Driver Stops Train to Collect 'Famous' Kachoris. And Then... రైలును అపేసి.. కచోరి కొన్న లోకో పైలట్.. ఆ తర్వాత..

Loco pilot stops train to pick up kachoris 5 suspended after video goes viral

loco pilot craving for kachori, loco-pilot suspended for stoping train, gateman suspended for kachori, locopilot stops train mid-way, train driver stops for kachori, alwar train stops for kachori, train stops for food, Kachori railway, railway kachori, train stops for kachoris, twitter, social media, Alwar district, Rajasthan, crime, viral video

one loco pilot’s craving for kachori was so intense that he decided to stop the train mid-way to get himself a plate of the tasty snack. The incident took place in the Alwar district in Rajasthan. A video of the bizarre incident is now going viral on different social media platforms. One Twitter user shared the clip which shows a man waiting dangerously in the middle of the train tracks.

ITEMVIDEOS: రైలును అపేసి.. కచోరి కొన్న లోకో పైలట్.. ఆ తర్వాత..

Posted: 02/24/2022 04:11 PM IST
Loco pilot stops train to pick up kachoris 5 suspended after video goes viral

రైలు ప్రయాణం చేసేవాళ్లకు ముందుగానే తమకు కావాల్సిన ఆహార పదార్థాలను సిద్దం చేసుకుని ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. రైలు ప్రారంభమైన తరువాత చీకటి పడగానే వాటిని తీసి తినడం ప్రారంభిస్తారు. ఇక రైలులో ఏదైనా తినుబంఢారం కనిపిస్తే.. అది కాస్తా ఇష్టమైనదైతే.. తీసుకుని తినేస్తాం. ఇలా ప్రయాణికులైతే తీసుకుని తినేస్తారు. కానీ రైలు నడిపే వ్యక్తికి (లోకోపైలట్) కు ఏదైనా ఇష్టమైన ఆహారం కనిపిస్తే ఏంచేస్తారు. ఇలా ఎవరూ ఆలోచించి ఉండరు కాబోలు. ఎందుకంటే ఎంతసేపు రైలు ఆగిన వెంటనే దిగేవాళ్లు,, ఎక్కేవాళ్లు తమతమ పనులతోనే నిమగ్నమవుతుంటారు.

అయితే రైలును ఆపి మాత్రం వారు కిందకు దిగలేరు. దీంతో ఎక్కడైతే రైలు అధిక సమయం ఆగుతుందో అక్కడే వారు తమకు ఇష్టమైన వాటిని లాగించేయాల్సి వుంటుంది. ఎందుకంటే వారు నడిపేది కారు కాదు.. రైలు. కారైతే తమకు నచ్చింది కొనుక్కోవచ్చు. కానీ రైలును ఆపేసి కొనుక్కోగలమా? సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఈ లోకోపైలట్ మాత్రం ఏకంగా తాను నడిపే రైలును అపేసి మరీ తనకు నచ్చిన కచోరి కొన్నాడు. అయితే ఈ ప్రక్రియ కొనసాగించేందుకు ఆయనకు సహకరించిన వారందరితో పాటు.. ఈ పనులను పర్యవేక్షించాల్సిన స్టేషన్ మాస్టారును కూడా సస్పెండ్ చేసేందుకు కారణమయ్యాడు.

రైల్వే స్టేషన్ దాటిన వెంటనే వచ్చిన రైల రోడ్డు క్రాసింగ్ వద్ద బ్రేక్ వేసి ఆపేసిన లోకోపైలట్.. ఒక వ్యక్తి తీసుకొచ్చిన కచోరి పార్సిల్ కవర్ ను తీసుకుని అంతే వేగంగా రైలును ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఒక ట్విట్టర్ యూజర్ దీన్ని షేర్ చేశాడు. కొందరు దీన్ని తప్పుబడితే, మరికొందరు నెట్టింట సమర్థించారు. చట్టవిరుద్ధంగా పైలట్ ఎలా వ్యవహరిస్తాడని కొందరు ప్రశ్నించారు.

దీంతో నార్త్ వెస్టర్న్ రైల్వే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రైలును నడిపిన లోకో పైలట్, అదే రైలులోని అసిస్టెంట్ లోకోపైలట్, ఇద్దరు గేట్ మ్యాన్ లు, స్టేషన్ మేనేజర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నార్త్ వెస్టర్న్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికిరణ్ మాట్లాడుతూ.. ‘‘మా దృష్టికి ఒక వీడియో వచ్చింది. అందులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కు గేట్ మ్యాన్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఉంది. వెంటనే చర్యలు తీసుకున్నాం’’ అని ప్రకటించారు. దీంతో నెటిజనులు లోకో పైలట్ కు అండగా నిలుస్తున్నారు. వారికి ఆకలి వేయదా.? అందరూ కొని తింటున్నట్లే తమకు ఇష్టమైనవి వారు కొనుక్కుని తినే అశకాశం కూడా లేదా.? అని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles